పెండింగ్ డీఏలు బిల్లులు చెల్లించాలి తపస్

పెండింగ్ డీఏలు బిల్లులు చెల్లించాలి తపస్

*జగిత్యాల జిల్లాలో పెండింగ్ డిఏ లు, బిల్లులు వెంటనే విడుదల చేయాలి..తపస్*

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న నాలుగు డి ఏ లను ( కరువు భత్యం) ఈ కుబీర్ లో నెలల తరబడి పెండింగులో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) రాష్ట్ర సహాధ్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్యలు డిమాండ్ చేశారు.. తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు  జగిత్యాల పట్టణ మండల శాఖల ఆధ్వర్యంలో  సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి జగిత్యాల అర్బన్ మండల తహసిల్దార్ రామ్మోహన్ రూరల్ డిప్యూటీ తాసిల్దార్ కార్తీక్ రెడ్డిల గార్ల ద్వారా వినతి పత్రాలు ఆందజేశారు. ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఉన్న బిల్లులు విడుదల కాకపోవడంతో అత్యవసరాలకు ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు అందరం లేదని వాపోయారు.. వెంటనే విడుదల చేయడంతో పాటు... పిఆర్సి కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని విన్నవించారు...ఈ కార్యక్రమంలో తపస్ జగిత్యాల పట్టణ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేందర్..రామకృష్ణ ..రాజేశ్వర్.. రమేష్. మహిపాల్ రెడ్డి.. జి. వి. రామకృష్ణ రాజశేఖర్ శర్మ. దేవరకొండ శ్రీనివాస్.. తదితరులు పాల్గొన్నారు.IMG-20241028-WA0016

Tags:

Related Posts