ఐటి మంత్రికి వినతి పత్రం

ఐటి మంత్రికి వినతి పత్రం

ఐటి మంత్రికి వినతిపత్రం 

చురకలు విలేకరి, మెట్ పల్లి, సెప్టెంబర్ 26 : మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతతో పాటు మున్సిపల్ కార్యాలయంలో మరియు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కొరత వల్ల పట్టణ,సమీప ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వెంటనే సిబ్బంది కొరతను తీర్చలంటూ మాజీ కౌన్సిలర్ ఎండి షేకీర్ గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబును నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయడానికి గైనకాలజిస్ట్, ఎంఎస్,ఎండి జనరల్ సర్జన్ డాక్టర్లు అత్యవసర సమయాల్లో అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,  మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది కొరతతో పట్టణంలో శానిటేషన్ పనులు అంతంత మాత్రమే జరగడంతో ప్రజలు డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నారని, పోలీస్ స్టేషన్లో బదిలీల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడటంతో పలు ప్రధాన రహదారి కూడలిలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీంతో ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్, సిబ్బంది కొరతను తీర్చాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.IMG-20240926-WA0000

Tags:

Related Posts