పేకాట స్థావరం పై పోలీసుల దాడి

పేకాట స్థావరం పై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి...!


రూ 7800 నగదు,2 ఫోన్లు,3 టూ వీలర్స్ స్వాధీనం,

ఎస్సై సిహెచ్ గణేష్


చురకలు విలేఖరి 
 ముస్తాబాద్ , అక్టోబర్,03
మండల కేంద్రంలో లింగంకుంట సమీప ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా ఎస్ఐ సిహెచ్ గణేష్ సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుండి 7800 నగదు,2 మొబైల్ ఫోన్లను,3 ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి,ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్సై సిహెచ్ గణేష్ తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు.IMG-20241003-WA0015

Tags:

Related Posts