ఘనంగా పోషణ మహోత్సవ వేడుకలు
ఘనంగా పోషణ మహోత్సవ వేడుకలు
జగిత్యాల ,సెప్టెంబర్ 30
జాతీయ పోషణ మాసంలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి 30 వరకు
స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా సోమవారం సారంగాపూర్ మండలంలోని రెచపెళ్ళి సెక్టార్ పరిధిలో రెచపెల్లి గ్రామపంచాయతీ ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ శైలజ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మహోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సారంగాపూర్ మండలం ఎమ్మార్వో జమీర్ , ఎంపిడిఓ గంగాధర్ ,డాక్టర్ ప్రభు కిరణ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య అతిథిలు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికై తల్లుల, గర్భిణీ స్త్రీలు , పిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తల్లులకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. తీసుకొని వారికి. తగు జాగ్రత్తల గురించి తల్లులకు వివరించారు. అనంతరం సూపర్ వైజర్ శైలజ మాట్లాడుతూ సామ్ మామ్ పిల్లలను గుర్తించి వారి ఎత్తు బరువు కొలత లను రక్తహీనత వల్ల జరిగే నష్టాల గురించి వివరించి రక్తహీనతను లేకుండా మనకు అందుబాటులో ఉండే కూరగాయలను ఆకుకూరలు తీసుకున్నట్లయితే రక్తహీనతను నివారించవచ్చని తెలిపారు. అంగన్వాడిలో ఇచ్చే బాలామృతం , అమృత ఆహారంను పిల్లలకు తినిపించాలి అని అన్నారు . అదేవిధంగా తప్పకుండా అంగన్వాడీలో అందించే సేవలు వినియోగించుని అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని పిల్లలను ఆట పాటలతో విద్యావంతులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు . అంగన్వాడి ప్రీ స్కూల్ పిల్లల గ్రాండ్ పేరెంట్స్ వయో వృద్ధుల వారవత్సవలను నిర్వహించారు . అనంతరం అందరిచే పోషణ మాస ప్రతిజ్ఞ చేయించినారు. ఈ కార్యక్రమంలో అర్ ఐ భాస్కర్ ఏ ఎన్ ఎం ,ఆశాలు , అంగన్వాడీ టీచర్లు స్వప్న , జమున ,శారద ,వినీల , దేశపాల,జమున మహేష్ , ఆయాలు, తల్లులు పిల్లలు , గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

