రిషి ద ప్లె స్కూల్ లో వేడుకగా ముందస్తు బతుకమ్మ సంబురాలు

రిషి ద ప్లె స్కూల్ లో వేడుకగా ముందస్తు బతుకమ్మ సంబురాలు

రిషి ద ప్లే స్కూల్లో వేడుకగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

చురకలు ప్రతినిధి కరీంనగర్ సెప్టెంబర్ 30


ప్రకృతి పులకరించే, ఆరాదించే పండుగ బతుకమ్మ పండుగ అని రిషి విద్యాసంస్థల చైర్మన్ కామారపు చెన్నప్ప అన్నారు. నగరంలోని మారుతీ నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల రిషి ద ప్లే స్కూల్లో పాఠశాలలో వైభవోపేతంగా పండుగ వాతవర్ణాన్ని మైమరిపించే విధంగా నిర్వహించినటువంటి ముందస్తు బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చేన్నప్ప మాట్లాడుతూ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన చూడచక్కగా ఊరూ రెట్టింపు అనురాగాన్ని అందంగా కృపను చెప్పారు. గుమ్మడి అమ్మవారి పండుగ బతుకమ్మ అని గుర్తుచేస్తూ అనురాగం చాలా వెల్లివిరిస్తూందన్నారు.

ప్రతి ఒక్కరు సంస్కృతి సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటించాలని మరియు ఉత్తమంగా వ్యవహరించాలని చెప్పారు. బొడ్డమ్మ ఆరంభం నాటి నుండి మహాఅష్టమి వరకు బతుకమ్మ ఆటను ఆకాశమే హద్దుగా అన్నట్టు వివిధ రకాల జానపద గేయాలు మరియు ప్రకృతి పులకరించే పాటలతో వేడుకలను జరుపుకుంటారని వారు చెప్పారు.
సుమారు 100మంది విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పాఠశాలలో పండుగ వాతావర్ణాన్ని రెట్టింపు చేశారు. అదే విధంగా సుమారు 50కి పైగా బతుకమ్మలను విద్యార్థులు వివిధ రూపాల్లో తయారుచేసి వారి ఆనందాన్ని కొలాట ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ కామారపు కౌశల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20240930-WA0009

Tags:

Related Posts