మానవాళికి మానవత్వం చూపిన మహోన్నతుడు మహమ్మద్ ప్రవక్త

మానవాళికి మానవత్వం చూపిన మహోన్నతుడు మహమ్మద్ ప్రవక్త

మహనీయ మహమ్మద్ ప్రవక్త జీవితం అనుసరణీయమని ప్రవక్త చెప్పిన ప్రవచనాలు యావత్తు మానవాళికి దిక్సూచి అని ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితం గడిపినప్పుడే మానవ జన్మకు సార్ధకత లభిస్తుందని మజ్లీస్ తహఫుజ్ ఖత్మే నబువత్ రిలీజియస్ ట్రస్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొయుద్దిన్ అన్నారు. మహనీయ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సందర్భంగా ఆదివారం ధర్మారం మండల కేంద్రంలోని మస్జిదే మహమ్మదియాలో మొహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పై ఆధ్యాత్మిక సదస్సు జల్సా సీరతున్నబి నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ముఫ్తి ఘియాస్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త లేకుంటే ఇస్లాం లేదని, ఇస్లామీయ జీవన విధి, విధానాలను చూపించిన గొప్ప మహనీయుడు మహమ్మద్ ప్రవక్త అని చెప్పారు. క్రీస్తు శకం 1500 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో మనిషిని, సాటి మనిషిగా ప్రేమించలేని విధంగా, బీదల హక్కును గుంజుకుని తినేల, ఆడ పిల్ల పుడితే సజీవంగా సమాధి చేసేటువంటి అజ్ఞాన అంధకారంలో ఉన్న ఈప్రపంచాన్ని వెలుగు రేఖలపై నడిపించిన గొప్ప సంఘ సంస్కర్త, వెలుతురు సూర్యుడు మహమ్మద్ ప్రవక్త అని, ఆయన జీవితం యావత్తు మానవాళికి ఆదర్శమని కొనియాడారు. మహమ్మద్ ప్రవక్త కేవలం ముస్లింలకు మాత్రమే ప్రవక్త కాదని, యావత్తు భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి ఆయన ప్రవక్త అని తెలిపారు. ఆయన జీవిత చరిత్రను సమాజంలో ఉండబడే అన్ని ధర్మలా, మతాల, కులాల, వర్గాల వారికి తెలియ పర్చాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో వేములవాడ మదరసా తాలిముల్ ఖురాన్ ప్రిన్సిపాల్ మౌలాన ఆసిముద్దీన్, మజిలీస్ తహఫుజ్ ఖత్మే నబువ్వత్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ కలీం షరీఫ్, ధర్మారం మహమ్మదియా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ బాబా, గౌరవ అధ్యక్షుడు గౌస్, మస్జిద్ ఇమామ్ జఫర్ ఆలం, సెక్రటరీ మేరాజ్, కోశాధికారి యునూస్, కమీటీ సభ్యులు ముజాహిద్, హుస్సేన్, మిస్బా, అలావుద్దీన్, యాదూల్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.IMG-20241020-WA0004

Tags:

Related Posts