పేద కుటుంబానికి ఆర్ధిక సయం అందజేత
పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత 
చురకలు విలేఖరి
జగిత్యాల రూరల్ :
జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామానికి చెందిన ఎగుర్ల మల్లమ్మ ఈ నెల పదహారవ తేదిన అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. మల్లమ్మ కు ఇద్దరు కుమారులు ఎగుర్ల మల్లికార్జున్ ఇరవై రెండు సంవత్సరాలు రెండవ కుమారుడు కుమార్ ఇరవై సంవత్సరాలు ఉండగా మల్లమ్మ భర్త పిల్లలు చిన్నతనంలోనే మరణించారు. నిరు పేద కుటుంబం కావడంతో ఇప్పుడు మల్లమ్మ మరణించడంతో ఇద్దరు కుమారులు తల్లితండ్రులు లేని అనాథలు కావడంతో దిక్కుతోచని స్థితిలో పిల్లలిద్దరు మల్లికార్జున్, కుమార్ ఉండడంతో వారి మిత్రులు, గ్రామ యువకులు, గ్రామస్థుల సహకారంతో సేకరించిన ( 30500/-) ముప్పై వేల ఐదు వందల రూపాయలను వారికి ఆదివారం రోజున అందజేయడం జరిగింది. తల్లి తండ్రి లేని పేద కుటుంబానికి ఎవరైనా దాతలు దయతలచి సహాయం చేస్తే పిల్లలిద్దరు వారికి రుణపడి ఉంటారని గ్రామ ప్రజలు తెలిపారు.

