సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవం
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవం. . *జగిత్యాల సెప్టెంబర్ 17:తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ ,పెన్షనర్స్ అసోసియేషన్స్ కార్యాలయాల ఆవరణల్లో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాటాల్లో అమరులైన వీరులకి నివాళులర్పించారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ పాఠ్య పుస్తకాల్లో ఆ వీరుల చరిత్రను చేర్చాల్లన్నారు.ఆ పోరాట చరిత్రను ఈ నాటి తరానికి స్ఫూర్తిదాయకంగా తెలియ పరిచేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ,తెలంగాణ చరిత్రను,సంస్కృతి,సాంప్రదాయాలను శాశ్వతం చేసేందుకు ప్రభుత్వం శ్రద్ద వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అంబుడ్స్ మెన్ అధికారి,రిటైర్డు జాయింట్ కలెక్టర్ కృష్ణా రెడ్డి,టీ ఉద్యోగుల జేఏసి జిల్లా చైర్మన్ భోగ శశిధర్,టీ ఎన్ ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ రెడ్డి,సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,నాయకులు దేవేందర్ రావు,ఎం.డి.యాకూబ్,హరిప్రసాద్ యాదవ్,భాస్కర్ రావు,నారాయణ,బాలయ్య,మారుతీ రావు,రాజ్ గోపాల్ చారి,సయ్యద్ యూసుఫ్,ఎం.డి.ఎక్బాల్,కొండాపూర్ యాకూబ్,ఇంద్రయ్య,గంగం జలజ,అరుణ ,రాజేశం,విఠల్,రవి,పురుషోత్తమ రావు,హన్మాండ్లు,తదితరులు పాల్గొన్నారు

