గణపతి సచ్చదానంద స్వామి ఆశీస్సులు అందుకున్న రాజేందర్ రావు

గణపతి సచ్చదానంద స్వామి ఆశీస్సులు అందుకున్న రాజేందర్ రావు

*గణపతి సచ్చిదానంద స్వామి* *ఆశీస్సులు అందుకున్న వెలిచాల రాజేందర్ రావు* 

 *కరీంనగర్*..

ఆధ్యాత్మిక గురువు, పరమ పూజ డాక్టర్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులను గురువారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అందుకున్నారు. హైదరాబాద్ కు వచ్చిన స్వామీజీని రాజేందర్ రావు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సచ్చిదానంద స్వామి నుంచి ఆశీస్సులు స్వీకరించారు. అనంతరం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ దత్తుని కృపతో ప్రపంచవ్యాప్తంగా హిందూ సంప్రదాయ విలువలను కాపాడేందుకు స్వచ్చిదానంద స్వామి ప్రత్యేకంగా కృషి చేస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో ధర్మాన్ని కాపాడేందుకు స్వామీజీ నిత్యము ఉపదేశాలిస్తూ ముందుకు వెళ్లడం మనం పూర్వ జన్మలో చేసుకున్న సుకృతమని తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడిపంటలు, ఆనందోత్సవాలతో విలసిల్లాలని స్వామీజీ ప్రవచనలు అందించడం గొప్ప అనుభూతిని ఇస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని సచ్చిదానంద స్వామి ఆశీస్సులు అందించారని తెలిపారు. అదేవిధంగా ప్రజలంతా సన్మార్గంతో పాటు ఆధ్యాత్మిక చింతనతో పయనించాలని స్వామీజీ ప్రవచనాలు అందిస్తున్నారని చెప్పారు. స్వామి వారు ఆశీస్సులు అందించిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నట్లు వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. స్వామీజీని కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో అనుభూతిని కలిగించిందని తెలిపారు. స్వామి వారి ఆధ్యాత్మిక ప్రవచనలు మానవాళికి అనుసరణీయమని, వారు సూచించిన మార్గంలో పయనించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని రాజేందర్ రావు పేర్కొన్నారు.IMG-20241017-WA0004

Tags:

Related Posts