రేవ్ పార్టీ కాదు రేవంత్ పార్టి కుట్ర

రేవ్ పార్టీ కాదు రేవంత్ పార్టి కుట్ర

రేవ్ పార్టీ కాదు రేవంత్ పార్టీ కుట్ర

కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకె కక్ష సాధింపు

పాలనా వైపల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే డ్రామా

కాంగ్రెస్ వి కుట్రపూరిత రాజకీయాలు

చురకలు విలేఖరి 
జగిత్యాల 


కేటీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక వారి బామ్మర్ది రాజ్ పాకాల ఇంటి పై సోదాల పేరుతో పోలీసులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ... 

*కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ**

కాంగ్రెస్ ప్రభుత్వ పది నెలల పాలన  రోజు ఒక అరాచకంగా చేస్తున్నారని... ఎమర్జెన్సీ కాలంలో ఏ విధంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసారో ఆ విధంగా ఇప్పడు హైడ్రా, మూసి సుందరికరణ, బేటాలియన్ కానిస్టేబుల్ వ్యవహారం, నిరుద్యోగుల, రైతుల రుణమాఫీ ఇలాంటి ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని..
బి ఆర్ యస్ పార్టీ నాయకుల మీద కె టి ఆర్  బామ్మర్ది కుటుంబ సభ్యులు గృహప్రవేశం సందర్బంగా విందు చేసుకుంటే ఎదో జరుగుతుందని కావాలని కక్ష గట్టి ప్రజల్లో బి ఆర్ యస్ పార్టీ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, బి ఆర్ యస్ పార్టీ ని లేకుండా చేయాలనీ చూస్తున్నారని...
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగా చెప్పిన ప్రకారం పక్క ప్రణాళిక ప్రకారం జరిగిందని..
ఇచ్చిన వాగ్దానాల అమలులో విఫలం, రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు...
సీఎం హుందాగా ఉండాలని, కేసీఆర్ ని తిట్టడమే ధ్యేయంగా...
ప్రజలకు ఏమి చేయాలో తెలియదు... 
పిచ్చి పనులు చేస్తే మైలేజ్ రాదు...

కాంగ్రెస్, బిజెపి  రెండు కలిసిపోతున్నాయని 
బండి సంజయ్ వ్యాఖ్యలను చుస్తే తెలిసిపోతుంది.. మీకు ఫామ్ హౌస్ లు లెవా?? బి ఆర్ యస్ పార్టీ నాయకులు, కే టి ఆర్  వారి కుటుంబ సభ్యులపై ప్రభుత్వ తిరును జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం....

*సుంకే రవిశంకర్  మాట్లాడుతూ**
జగిత్యాల జిల్లా ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు..
జాన్వాడ లోని ఒక గృహంలో ఒక స్వంత ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమం సందర్బంగా విందు కార్యక్రమం సందర్బంగా నాలుగు మద్యం సీసాలు ఉంటే దానికి డ్రగ్స్ పేరు వాడి.. కేటీఆర్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రజల ద్రుష్టి మరల్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని...
అక్కడ చిన్న పిల్లలు, 70ఏళ్ల వయసున్న మహిళలు, కుటుంబ సభ్యులు ఉంటే మహిళలు, పురుషులు పాల్గొన్నారని 
రేవూ పార్టీ అని చెప్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారని..ఇంత నీచమైన పరిస్థితి ఉందని... కంపెనీలు తరలి వెళ్తున్నాయని,, 144,163సెక్షన్లు పెట్టె దౌర్బాగ్య పరిస్థితి అని...
ఏ రంగమైన కూదేలావుతుందని...
బండి సంజయ్ వ్యాఖ్యలు గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు ఉన్నాడు... మొదటి ఎన్నికల్లో పుస్తెల తాడు కుదువా పెట్టానని, ఇప్పుడు 150కోట్లు ఖర్చు పెట్టడని అవి ఎలా వచ్చాయి.. బండి సంజయ్ అది విల్లా,ఫామ్ హౌస్ తెలుసుకో...

బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్,కేటీఆర్ కి వస్తున్న ఆదరణ చూసే ప్రతి రోజు ఎదో ఒక అంశం...తీస్తున్నారని

*దావ వసంతసురేష్ మాట్లాడుతూ:-*

 రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని..ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు...

ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక,ప్రజల తిరుగుబాటును తప్పించుకోలేక కేటీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక వారి బామ్మర్ది రాజ్ పాకాల ఇంటి పై సోదాల పేరుతో పోలీసులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు..

ప్రతిపక్షాల కుటుంబసభ్యుల ఇంట్లో ఏం జరుగుతున్నాయో అన్న అంశాల వాటి పైన దృష్టి ధాన్యం కొనుగోళ్ల పై తూకం.హమాలీల సమస్యల పై దృష్టి ఎందుకు లేదని ప్రశ్నించారు

తమ ఇంట్లోని మహిళలందరు కలిసి కూర్చుని తింటే దాన్ని ఒక రేవ్ పార్టీ కింద చిత్రీకరించి మిధైతే మీడియాకి చూపిస్తారా.. 

మీ మహిళలను ఒక రకంగా ఇతర కుటుంబసభ్యుల మహిళలను ఒక రకంగా భావించి చూపించే సంస్కృతి,నిండు అసెంబ్లీలో మహిళలను అవమానించే సంస్కృతి రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు...

మీకు చేతనైతే మీరు ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలను అమలు చేయండి..కానీ మహిళను కించపరిచే ఇటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఉన్నందుకు మహిళలందరు చికొడుతున్నారని అన్నారు..

కెసిఆర్ పాలన చూసి నేర్చుకోవాలని హితవు పలికారు

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంకప్రవీణ్ పట్టణ అద్యక్షుడు గట్టు సతీష్,ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం నాయకులు అమీన్ భాయ్,ఆసీఫ్,రిజ్వాన్,గాజుల శ్రీనివాస్,మోర వెంకటేశ్వర్లు,నీరటీ శ్రీనివాస్,మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు...IMG-20241028-WA0002

Tags:

Related Posts