తల్లిదండ్రులను విస్మరించే పిల్లలు శిఖర్హులే... ఆర్డీఓ పులి మధుసూదన్

తల్లిదండ్రులను విస్మరించే పిల్లలు శిఖర్హులే... ఆర్డీఓ పులి మధుసూదన్

తల్లిదండ్రులను విస్మరించే పిల్లలు శిక్షార్హులే..    

         -జగిత్యాల ఆర్డీవో మధుసూదన్.      

IMG-20240928-WA0017                                    జగిత్యాల సెప్టెంబర్ 28   : వయోవృద్ధులైన కన్న తల్లి,దండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షార్హులేనని   చట్టపరమైన చర్యలు తప్పవని జగిత్యాల డివిజన్ ఆర్డీవో,వయోవృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి.మధుసూదన్ హెచ్చరించారు.శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్ధుల పోషణ,సంరక్షణ చట్టం కింద  దాఖలు  అయిన  కేసుల్లో కొడుకులు,కోడళ్ళను ,కూతుర్లను  ఆర్డీవో  ముందు విచారణకు హాజరయ్యారు.విచారణల్లో  రాయికల్  మండలం అయోధ్య   గ్రామానికి చెందిన   ఎడ్ల నర్సమ్మ,గొల్లపల్లి  మండలం     వెన్గుమట్ల గ్రామానికి చెందిన  పోడేటి ఎల్లవ్వ,జగిత్యాల పట్టణం లో పోచమ్మ వాడకు చెందిన బోరే గంగారాం,  గణేష్ నగర్ కు చెందిన కట్ట లక్ష్మీ లను ఫిర్యాదులపై ఆర్డీవో విచారణలు జరిపారు.   తమ కుమారులనుంచి పోషణ,వైద్య ఖర్చులు ఇప్పించాలనే కేసుల్లో ఆవృద్ధుల తరపున సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తన వాదనలు ఆర్డీవో కు వినిపించారు. కొడుకులు,కోడళ్ళకు ఆర్డీవో కౌన్సెలింగ్ చేశారు.అనంతరం ఆర్డీవో  ఫిర్యాదుదారుల, కొడుకుల,కొడళ్ల,కూతుర్ల వాంగ్మూలం లను  విని సాక్ష్యాధారాలు పరిశీలించారు.అనంతరం 
 సంరక్షణ చట్టం 2007 సెక్షన్ 24 ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులను  పోషించక నిరాధరిస్తు వేధింపులకు గురిచేస్తున్న వారికి,నోటీసులు ఇచ్చినా హాజరు కాని వారికి ,తీర్పులు పాటించని వారికి  6 నెలల వరకు జైలు శిక్ష తో పాటు జరిమాన విధించే వీలుందని  కొడుకుల ను,కోడళ్లను ,కూతుర్లను  హెచ్చరిస్తూ  తల్లిదండ్రుల పోషణకు,సంరక్షణకు ఆదేశించారు. ఈ  విచారణ లో ఆర్డీవో కార్యాలయం ఏ.ఓ.తఫజుల్ హుస్సేన్, సీనియర్ సిటీజేన్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కౌన్సెలింగ్  ప్రతినిధులు  గౌరిశెట్టివిశ్వనాథం, వెల్ముల ప్రకాష్ రావు, సీనియర్ సహాయకులు  పద్మజ,తదితరులున్నారు.

Tags:

Related Posts