పూర్వ విద్యార్థుల సమ్మేళనం
*45 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం.
చురకలు విలేఖరి
హుజురాబాద్, ఫిబ్రవరి, 10
హుజరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 1979 - 1981 బ్యాచ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈరోజు హుజరాబాద్ క్లబ్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా వారికి విద్యభ్యాసం చేసిన ప్రిన్సిపల్ వీరయ్య,ఆత్మరావ్,పాపయ్య,మల్లారెడ్డి గురువులను ఘనంగా శాలువా మెమొంటోతో సన్మానం చేశారు,ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు విద్యతోపాటు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని నేటి భావి జీవితంలో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారని వారి జీవితకాలమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు,అనంతరం పూర్వ విద్యార్థులు చిన్నతనంలో వారు చేసిన బాల్యం నాటి పనుల అనుభవాలను గుర్తు తెచ్చుకొని ఆనందంగా గడిపారు,
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎండి మక్బూల్ హుస్సేన్,గోపాల్ రావు,రాజేందర్,ప్రభాకర్,జనార్దన్ రెడ్డి,ఉమాపతి,మల్లికార్జున రావు,శ్రీనివాస్,రాధా, యు రాజయ్య, రాధా కిషన్ ,విప్లవదాత్, రాజశేఖర్ ,ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు

