సిఐ కు పాత్రికేయుల సన్మానం

సిఐ కు పాత్రికేయుల సన్మానం

*సీఐ కి పాత్రికేయుల సన్మానం*

ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన నిరంజన్ రెడ్డి 

జగిత్యాల :

ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన జగిత్యాల జిల్లా మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎనుముల నిరంజన్ రెడ్డిని శనివారం పాత్రికేయులు సన్మానించారు.

పోలీస్ శాఖలో సమర్థవంతమైన విధులు నిర్వర్తించడమే కాకుండా జగిత్యాల జిల్లాలో నక్సలైట్ల కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు వారిపై ఉక్కుపాదం మోపిన సీఐ నిరంజన్ రెడ్డి కి పోలీస్ శాఖలో దేశ అత్యున్నత ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక చేయడం గర్వకారణమని పాత్రికేయులు కొనియాడారు.

మెట్పల్లి సీఐ కార్యాలయంకు వెళ్లిన జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తిరుణగరి శ్రీనివాస్, మెట్పల్లి పాత్రికేయుడు ఎండి వసిమ్ లు సీఐ నిరంజన్ రెడ్డినీ శాలువాలతో సన్మానించి భవిష్యత్ లో మరిన్ని పథకాలు ఎందుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం ప్రజాపక్షం దినపత్రిక డైరీని జగిత్యాల జిల్లా ప్రజాపక్షం ప్రతినిధి సీఐ నిరంజన్ రెడ్డికి పాత్రికేయులు వసీమ్, శ్రీనివాస్ లతో కలిసి అందించారు.IMG-20250201-WA0129

Tags:

Related Posts