మెట్ పల్లి సీఐకి శుభాకాంక్షల వెల్లువ. సీఐ నిరంజన్ రెడ్డిని సన్మానించిన ఎస్ఐలు, సిబ్బంది.

మెట్ పల్లి సీఐకి శుభాకాంక్షల వెల్లువ.  సీఐ నిరంజన్ రెడ్డిని సన్మానించిన ఎస్ఐలు, సిబ్బంది.

మెట్ పల్లి సీఐకి శుభాకాంక్షల వెల్లువ.

సీఐ నిరంజన్ రెడ్డిని సన్మానించిన ఎస్ఐలు, సిబ్బంది.

చురకలు విలేకరి, మెట్ పల్లి, జనవరి 26: పోలీస్ శాఖలో అందిస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఎంపిక కాగా ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆదివారం మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పబ్బ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది ఇండియన్ పోలీస్ మెడల్ కు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువా, పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక కావడం తన కెరీర్ లో మైలురాయి అని అన్నారు. అనంతరం ఎస్ఐ పబ్బ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సీఐ నిరంజన్ రెడ్డి గత 35 ఏళ్లుగా పోలీస్ శాఖలో అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక కావడం గర్వకారణమన్నారు.IMG-20250126-WA1797IMG-20250126-WA1797IMG-20250126-WA1797

Tags:

Related Posts