సీఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
సీఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 3: సీఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన అబ్దుల్ జలీల్ అనే వ్యక్తి 20 రోజుల క్రితం రూ.1,46,000 విలువగల ఆపిల్ 16 ప్రో పోగా అతను వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో ఫోన్ నెంబర్ ను మరియు ఐఎంఈఐ నంబర్ ను అప్లోడ్ చేశారు. సీఈఐఆర్ టెక్నాలజీతో ఆ ఫోన్ ను ట్రేస్ చేసి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ బాధితునికి అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే సీఈఐఆర్ పోర్టల్ పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోయినటువంటి ఫోన్ ను త్వరితగతిన ట్రేస్ చేసి బాధితునికి అప్పగించడంతో సీఈఐఆర్ టీమ్ ను ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్, సీఈఐఆర్ టీం సభ్యులు పాల్గొన్నారు.

