మెట్ పల్లి మార్కెట్ యార్డులో న్యాయ విజ్ఞాన సదస్సు
మెట్ పల్లి మార్కెట్ యార్డులో న్యాయ విజ్ఞాన సదస్సు
మెట్ పల్లి మార్కెట్ యార్డులో న్యాయ విజ్ఞాన సదస్సు
చురకలు ప్రతినిధి జనవరి 18 : మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కార్మికులు కార్మిక సంక్షేమ చట్టాలను ఉపయోగించుకోవాలి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి డి నాగేశ్వరరావు ఈరోజు మెట్ పల్లి మార్కెట్ యార్డులో న్యాయ విజ్ఞాన సదస్సు మండల లీగల్ సేల్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి
డి. నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగములో కార్మికుల కొరకు అనేకరకాల సంక్షేమ చట్టాలు రూపొందించడం జరిగింది వివిధ రంగాలకు చెందిన హమాలి మరియు భవన నిర్మాణ ఆటో వివిధ రంగాలకు చెందిన కార్మికులు సంక్షేమ చట్టాలను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని కోరారు కార్మికులు ఇన్సూరెన్స్ను ఉపయోగించుకొని మరియు డ్రైవింగ్ లైసెన్సులు ఉంచుకోవాలని కోరారు కార్మికులు తాగుడుకు బానిసలు కావద్దని పిల్లలను మంచిగా చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని కోరారు కార్మికులకు కోర్టు పరంగా ఏవైనా అవసరాలు ఉంటే నేరుగా సంప్రదించాలని ఉచితంగా న్యాయ సేవలు అందజేస్తామని తెలిపారు. డి.ఎస్.పి రాములు మరియు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి లు మాట్లాడుతూ కార్మికులు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని మరియు చట్టాలను గౌరవించాలని కోరారు అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కోన గోవర్ధన్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీ డి నాగేశ్వరరావు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాములు సీఐ నిరంజన్ రెడ్డి లేబర్ ఆఫీసర్ కృష్ణ సాగర్ ఎస్సైలు కిరణ్ రాజు నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి ఉపాధ్యక్షుడు రాంబాబు ప్రధాన కార్యదర్శి వేణు న్యాయవాదులు వెంకట నరసయ్య వెంకటస్వామి మన్నే గంగాధర్ జెడి సుధాకర్ స్రవంతి శంకర్ రెడ్డి శంకర్ రాందాసు శేఖర్ ప్రశాంత్ వేణు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు


