నృసింహుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా ఎల్ ఐ సి జోనల్ మేనేజర్

నృసింహుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా ఎల్ ఐ సి జోనల్ మేనేజర్

నృసింహుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్న.

ఎల్ ఐ సి జోనల్ మేనేజర్ పునీత్ కుమార్. 

 

ధర్మపురి,

IMG-20250209-WA0112
 లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అన్నారు. 

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయాన్ని ఎల్ఐసి అధికారులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు , అర్చకులు దేవాలయంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ  సేవా రంగమైన ఎల్ఐసి సంస్థలో విధులు నిర్వహించడం సంతోషంగా ఉందని, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా  చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన వెంట 
చీఫ్ ఇంజనీర్  ఆర్ ఎల్ ఎన్ స్వామి ,కరీంనగర్ ఎస్ డి ఎం ఎస్ వి ప్రసాద్ రావు ,
మార్కెటింగ్ మేనేజర్ 
  ఎంఆర్కె శ్రీనివాస్ ,
జగిత్యాల బ్రాంచ్ మేనేజర్ బలరామకృష్ణ ,
ధర్మపురి, మంతెన  బ్రాంచ్ మేనేజర్లు  శుభాకర్ రావ్, ఇందారపు రాం కిషన్,
ఏబీఎం శివరాం , ఎల్ఐసి డి  ఓ శ్రీకర్ ,ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Tags: