వాహనదారులు తప్పక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

వాహనదారులు తప్పక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.   జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

IMG-20250205-WA0109వాహనదారులు తప్పక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. 

జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 5 : వాహనదారులు తప్పక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో పలు
చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపిస్తున్న వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారు, ఇతర వాహనాలు నడిపేవారు తప్పకుండా సీల్డ్ బెల్టు పెట్టుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.IMG-20250205-WA0021

Tags:

Related Posts