అధికారులు, సిబ్బంది ఆయుధ పరిజ్ఞానం కలిగి ఉండాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
అధికారులు, సిబ్బంది ఆయుధ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 31: పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయుధ పరిజ్ఞానం కలిగి ఉండాలణి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు. వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సందర్శించి సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణ ను పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కలిగి ఉండాలని, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణలో నేర్పించిన మెలకువులను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతిభద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలన్నారు. ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినదించారు. ఈ శిక్షణలో డీఎస్పీలు రఘుచందర్, రాములు, రంగారెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ కిరణ్ కుమార్, వేణు సిఐలు, ఎస్ఐలు రిజర్వ్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

