అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం. జిల్లాలో 30 మంది బాల కార్మికులకు విముక్తి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం.
జిల్లాలో 30 మంది బాల కార్మికులకు విముక్తి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 1 : బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్- ఇన్స్ పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్,ఒక మహిళ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించామన్నారు. 30 మంది బాలకార్మికులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం తెలిపారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, మరియు ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్న, ఎక్కడైనా పనిచేసిన, తప్పిపోయిన వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు. బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు . పోలీసు శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ -11 విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

