పోలీస్ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమాన్వయంతో పని చేయాలి ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమాన్వయంతో పని చేయాలి ఎస్పీ అశోక్ కుమార్

పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయాలి.

గడిచిన సంవత్సర కాలంలో 64 కేసులలో నిందితులకు జైలు శిక్షలు.

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్


చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 29: పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయాలని, గడిచిన సంవత్సర కాలంలో 64 కేసులలో నిందితులకు జైలు శిక్షలు విధించారని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గత ఏడాదికాలంగా 64 కేసుల్లో నిందితులకు శిక్షలు పడటంలో కృషి చేసిన పీపీలను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమని, పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు మొదలు, కేసు విచారణలో సదరు పోలీస్ అధికారులకు సూచన చేయడం, పోలీసు అధికారులు సాక్షులను సరైన పద్దతిలో ప్రొడ్యూస్ చేయు పద్ధతి, మొదలైన అనేక అంశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా పని చేయటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నూతన చట్టాల అమలులో పోలీసు అధికారులకు ఏర్పడే సందేహాలను నివృత్తి చేశారు. గడిచిన సంవత్సర కాలంలో 64 కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం కృషి చేసిన పీపీలు అభినందించి శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేసి ఏఏపిలు బి.రాజేష్, ఎం. రజిని, జి. ప్రణయ్, పీపీ మల్లికార్జున్, పిపిఐ కె. మల్లేశం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ పీపీ చీటి రామకృష్ణ రావులను అభినందించారు.ఈ సమావేశంలో డిఎస్పీలు రఘు చందర్, రాములు, రంగారెడ్డి, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.IMG-20250129-WA0056

Tags:

Related Posts