జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎస్పీ అశోక్ కుమార్

 

*జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.*
       
*- - - -జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

చురకలు విలేఖరి 

జగిత్యాల IMG-20250126-WA1507

 76 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా  జిల్లా ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు. 

ఈ సందర్భంగా  ఎస్పీ గారు మాట్లాడుతూ ....ఎందరో త్యాగధనుల ఫలితం మే గణతంత్ర దినోత్సవం అని వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి అని వారి త్యాగఫలం ద్వారా మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపినారు.మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత సమాజంలో ఏ విలువలకు కట్టుబడి ఉండాలి అనేది రాజ్యాంగంలో రూపొందించబడింది తెలిపారు. స్వేచ్ఛ ,సమానత్వం ,సౌభ్రాతృత్వం అనే విలువలతో మన రాజ్యాంగం రూపొందించబడింది అని ఈ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి ఒక్క చట్టం అమలు చేయబడుతుంది అని తెలిపారు. ఈ చట్టాలను అమలు చేసే బాధ్యత అందరికంటే ముందుగా పోలీసు డిపార్ట్మెంట్ పై  ఉందని కాబట్టి ఈ యొక్క విలువలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ యొక్క విలువలకు కట్టుబడి చట్టాలను అమలు చేస్తామని, జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు,డీఎస్పీ రంగారెడ్డి,SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, రామకృష్ణ, వేణు RSI లు హెడ్ క్వార్టర్ సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts