కొత్త ఓటర్ల లిస్ట్ విడుదల
By: Mohammad Imran
On
కొత్త ఓటర్ లిస్ట్ విడుదల
బుగ్గారం ;
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామానికి సంబంధించిన కొత్త ఓటర్ లిస్ట్ ప్రతులను వార్డుల వారీగా శనివారం పంచాయతీ కార్యదర్శి ఎం. ఎ. అక్బర్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. గ్రామానికి చెందిన మొత్తం ఓటర్ లను ప్రభుత్వం 12 వార్డులుగా విభజించిందని ఆయన తెలిపారు. వార్డుల వారీగా గల ఈ ఓటర్ లిస్టులో గ్రామస్తులు తమ పేరు ఉందో... లేదో... చూసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్ లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎలాంటి సమాచారం ఉన్నా గ్రామస్తులకు తెలియ జేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నగునూరి నర్స గౌడ్, కొడిమ్యాల రాజన్న, భారతపు మహేష్, జంగ శ్రీనివాస్, పనకంటి కైలాసం, సుంకం ప్రశాంత్, శంకర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

