రిటైడ్ సబ్ రిజస్ట్రార్ అమృత రాజం మృతి
By: Mohammad Imran
On
రిటైర్డ్ సబ్ రిజిస్టర్ మృతి
జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన రిటైర్డ్ సబ్ రిజిస్టర్ భోగ అమృత రాజం (70) ఆదివారం మృతి చెందారు. ఇది వరకు ఆయన జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సూపరిండెంట్ గా పనిచేశారు. పదోన్నతి పొంది సబ్ రిజిస్టర్ గా రిటైర్ అయ్యారు. జగిత్యాల పట్టణంలోని జంబి గద్దె ప్రాంతంలో నివాసం ఉండే అమృత రాజం స్థానికంగా అందరికీ సుపరిచితుడు. వారి ఆకస్మిక మరణ వార్త తెలుసుకున్న పట్టణ ప్రముఖులు, సీనియర్ డాక్యుమెంట్ రైటర్లు, పలువురు స్టాంప్ వెండర్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేసి కుటుంబం సభ్యులకు సంతాపం వెలిబుచ్చారు. కాగా అమృత రాజంకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Tags:

