పదవీ విరమణ ప్రయోజనాలు అందని ద్రాక్షేనా!

పదవీ విరమణ ప్రయోజనాలు అందని ద్రాక్షేనా!

పదవీ విరమణ ప్రయోజనాలు అందని ద్రాక్షేనా!                                     -వేల మంది రిటైర్డ్ ఉద్యోగుల,ఉపాధ్యాయుల్లో ఆందోళనలు.                         -  జిల్లాలో  పెన్షన్  ప్రయోజనాల కోసం 200 మంది  ఎదురుచూపులు.                 జగిత్యాల :రాష్ట్రంలో వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు,అధికారులు,ఉపాధ్యాయులు పదవీవిరమణ ప్రయోజనాలు ఆరు నెలలు  దాటినా అందకపోవడంతో పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది.ఆ గడువు సైతం మార్చి 2024 తో ముగిసింది.అప్పటి నుంచి ప్రతి నెలా 1,200 నుంచి 1600 వరకు రిటైర్ అవుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఆ రిటైర్ అయిన అధికారులు, ఉద్యోగులు,ఉపాధ్యాయులు 200 మంది ఉన్నారు. ప్రభుత్వం నుంచి పదవీ విరమణ ప్రయోజనాలు అందక వారు, వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కేసుకొని పిల్లల వివాహాలు,ఇంటి నిర్మాణం,తదితర అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించుకున్న వారి,ఆ సొమ్ము చేతికి అందుతుందనే భరోసా తో అప్పులు చేసి కార్యాలను ఒడ్డెక్కి0చుకున్న వారి పరిచయ అగమ్యగోచరంగా మారింది.నెలలు దొర్లుతున్నా ఇంకా ఆ పదవీవిరమణ సొమ్ము చేతికి అందకపోవడంతో సతమతమవుతున్నారు.కొందరు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరుగుతోందని తీవ్ర ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.సర్వీసు పూర్తవ బోతున్న ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఇదే చర్చ. ఈ నేపథ్యంలో ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం       ఇస్తుందా? ఇవ్వక పోతే పరిస్థితి ఏమిటో ? అన్న  ఆందోళనలో పదవీ విరమణ    ఉద్యోగులున్నారు.   వృద్దాప్యంలో ఎలా బతుకాలి ?  అంటూ   విరమణ  పొంది ప్రయోజనాలు అందని పలువురు అటు ఉద్యోగ ,ఇటు పెన్షనర్ల నేతల వెంబడితిరుగుతూ  ప్రయోజనాలు సత్వరం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ప్రాధేయపడుతున్నారు.              *ప్రయోజనాలు  ఇవ్వాల్సింది ఇలా...                 పదవీవిరమణ చెందిన ఉద్యోగికి గ్రాట్యుటీ,వేతనం నుంచి ప్రతి నెలా  ప్రభుత్వం వద్ద పొదుపు చేసుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ,గ్రూప్ ఇన్సూరెన్స్,కమ్యూటేషన్,సరెండర్ లీవులు తదితర రూపేణా ఇవ్వాల్సిన ప్రయోజనాల సొమ్ము ఎక మొత్తంలో  పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాలి. చెల్లించడం లో ఆలస్యమైనా వడ్డీ ఏమైనా ప్రభుత్వం ఇస్తుందా అంటే అలాంటిదేమి ఉండదు.ఈ ఆరు  నెలల కాలంలో పదవీ విరమణ చెందిన అధికారులకు,ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు అన్ని ప్రయోజనాలు చెల్లించాలని అంటే రూ.2000 కోట్ల నుంచి రూ.2600 కోట్ల వరకు అవసరమని అంచనా.ప్రతి జిల్లాలో వివిధ రకాల చెల్లింపులు,బిల్లులు పెండింగులో ఉన్నాయని,జగిత్యాల జిల్లాలో రిటైర్ అయిన ఉద్యోగులు,ఉపాధ్యాయులు,అధికారులు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ వారి తరపున ఆందోళన వ్యక్తం చేశారు.         *విరమణ ఉద్యోగుల్లో ఆందోళనలు.                          -హరి ఆశోక్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు,తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్,జగిత్యాల జిల్లా.                                       కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వంకు భిన్నంగా పెన్షనర్లకు  పెన్షన్లను  ,ఉద్యోగులకు వేతనాలను సకాలంలో ఇస్తున్నట్లుగానే పదవీ విరమణ ప్రయోజనాలను కూడా చెల్లించేలా మా టి.పి.సి.ఏ.రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో ఒత్తిడి  తీసుకోస్తాం.కొత్త ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అటు  ఉద్యోగులకు,పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డి.ఏ.లను, పీ ఆర్
సీ.ఫిట్మెంట్,నగదు రహిత వైద్య సేవలు  తదితర సమస్యల పరిష్కారం,పదవీ విరమణ చెందిన వారికి      సకాలంలో  ఇవ్వాలని టీ జీ జాక్ తరపున రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో పలు మార్లు ప్రభుత్వంనకు విన్నవించాము.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ప్రతి నెల మొదటి తేదేనే వేతనాలు,పెన్షన్లు ఇచ్చినట్లుగానే సమస్యలు తీరుస్తారనే విశ్వాసం ఉంది.IMG-20240922-WA0001

Tags:

Related Posts