కనికరం లేని స్కూల్ యాజమాన్యం
*కనికరం లేని స్కూల్ యాజమాన్యం*
జగిత్యాల, అక్టోబర్,01.
జగిత్యాల పట్టణములోని IIT చుక్కరామయ్య స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న సాకీబ్ ఫిడ్స్ వచ్చి పడిపోవడంతో కనీసం స్కూల్ యాజమాన్యం స్పందించలేదు. తల్లిదండ్రులు స్కూలుకి వచ్చి యాజమాన్యాన్ని నిలదీయగా విద్యార్థి తల్లిదండ్రులతో స్కూల్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడం నిర్లక్ష్యంగా సమాధానం తెలపడంతో స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లి తండ్రులు మండిపడ్డారు. పిల్లలకు ఏమైనా పట్టించుకోలేని పరిస్థితిలో స్కూల్ యాజమాన్యం ఉంది అని ఫిట్స్ వచ్చి పడిపోయిన విద్యార్థికి కనీస ప్రధమ చికిత్స చేయకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు వచ్చేవరకు చూడడాన్ని తప్పుపడుతూ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసిన యాజమాన్యం తిరిగి తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించడం చేయడంతో విద్యార్థులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా విద్యార్థుల ప్రాణాలను గాలికి వదిలేసిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

