సాయుధ పోరాట నిప్పు కణిక వీరనారి చాకలి ఐలమ్మ ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సాయుధ పోరాట నిప్పు కణిక వీరనారి చాకలి ఐలమ్మ ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సాయుధ పోరాట నిప్పు కణిక వీరనారి చాకలి ఐలమ్మ 

చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి నేటి సమాజానికి ఆదర్శం 

 
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

చురకలు ప్రతినిధి, జగిత్యాల, సెప్టెంబర్ 26 : సాయుధ పోరాట నిప్పు కణిక, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్న సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తొ కలిసి చింతకుంట చెరువు సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని తెలిపారు. బహుజన ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని, నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి, కృషి గురించి తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతి రోజులను కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ భావితరాలకు ఆమె స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. యావత్ మహిళా లోకానికి ఆదర్శమైనటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ నైజాం రాచరిక పాలనలో భూస్వామ్య వ్యవస్థను నిర్వహింప విధంగా దున్నే వారిదే భూమి ఆలోచన విధానంతో ఆనాటి భూస్వామ్య వ్యవస్థను ఎదిరించిన వీర వనిత చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శమని,  ఆనాటి రజాకర్లను ఎదిరించి పోరాటం చేయడమే గాని నైజాం ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా పోరాటం చేయడంలో ముందు నిలిచినటువంటి ఐలమ్మ అందరికి స్ఫూర్తిదాయకమని  తెలిపారు. ఈ స్ఫూర్తి మన ఆడబిడ్డలకు నింపే విధంగా ఇప్పటి విద్యార్థినులకు ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని ఒక ఆత్మవిశ్వాసం తోని ముందుకు పోయే విధంగా ఉండాలని ఒక భావనతో మహిళా యూనివర్సిటీ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐలమ్మ పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ పి. రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ అడువాల జ్యోతి, జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు, వివిధ సంఘాల సభ్యులు, నాయకులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారుIMG-20240926-WA0002

Tags:

Related Posts