ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ అమలు చేయాలి శేర్ నర్సారెడ్డి విజ్ఞప్తి

ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ అమలు చేయాలి   శేర్ నర్సారెడ్డి విజ్ఞప్తి

ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ అమలు చేయాలి ....... 

తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి విజ్ఞప్తి  

జగిIMG-20241001-WA0014త్యాల  , అక్టోబర్,01
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిందనీ, ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు సిఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. అయితే బ్యాంకు సాంకేతిక సమస్యల కారణంగా కొందరికి రుణమాఫీ కాలేదన్నారు. త్వరలోనే సమస్యను గుర్తించి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. రేషన్ కార్డుతో రుణమాఫీకి లింక్ పెట్టవద్దని డిమాండ్ చేశారు. కొత్త రుణాల విషయంలో బ్యాంకర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ, ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేసి,  కొత్త రుణాల మంజూరు విషయంలో సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:

Related Posts