పిల్లాపాపలతో ప్రశాంతంగా నిద్రపోండి మధుయాష్కీ గౌడ్
*పిల్లాపాపలతో ప్రశాంతంగా నిద్రపోండి*
- మీ ఇళ్లు ఎవరు కూల్చరు..
- మీ ఇంటిపై ఒక్క గడ్డపార పడదు
* మీ ఇంటి మీదికి ఒక ప్రోక్లైన రాదు
* మూసి సమీప నివాసులతో మధుయాష్కీగౌడ్
* కొత్తపేట, చైతన్యపురి డివిజన్ లలో ప్రజలతో కలిసి మాట్లాడిన మధు యాష్కీ గౌడ్
* ప్రభుత్వం అన్యాయంగా ఇల్లు కూలగొడితే మీ సోదరుడిగా, న్యాయవాదిగా పైసా ఖర్చు భారం పడకుండా కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తా
* మీరు డైనమిక్ లీడర్ సార్.. మీరే మమ్మల్ని కాపాడాలి
* మధు యాష్కీ గౌడ్ తో మూసి సమీప మహిళలు వేడుకోలు
'మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదు.. పిల్లాపాపలతో నిశ్చింతంగా నిద్రపోండి.. నాది గ్యారెంటీ ' అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ మూసి సమీప కాలనీల ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇళ్లు ఇచ్చే ప్రభుత్వమని.. ఎవరి ఇళ్లు కూలగొట్టదు అని పేర్కొన్నారు. మీ ఇళ్ల పైకి ఒక్క గడ్డపార రాదని.. ఒక ప్రోక్లనర్ కూడా రాకుండా చూసే బాధ్యత నాది అని పేర్కొన్నారు.
మూసీ సుందరీకరణ లో భాగంగా సమీప కాలనీల లోని ఇళ్లు కూలగొడతారని, మార్కింగులు ఇచ్చారని ప్రజలు గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో మధుయాష్కిగౌడ్ మంగళవారం కొత్తపేట , చైతన్యపురి డివిజన్లో పర్యటించారు. మూసి సమీప ఇళ్ళ నివాసులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఎవరు ఇళ్లు కూలగొట్టరని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
*మీరు డైనమిక్ లీడర్ సార్... మీరే మా ఇళ్లను కాపాడాలి. అప్పులు చేసి , పుస్తెలతాళ్ళు కుదువపెట్టి ఇళ్లు కొన్నామని* మహిళలు కన్నీరు పెట్టి మధుయాష్కీగౌడ్ కు తమ ఆందోళనను వెలిబుచ్చారు.
స్పందించిన మధుయాష్కి .. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధిష్టానం ఉందని, ఒకవేళ అన్యాయంగా ప్రజల ఇళ్లు కులగొడితే.. అధిష్టానం కూడా జోక్యం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తాను కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయే స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా తన స్వార్థం కోసం మూసి సుందరీకరణ చేపట్టడం లేదన్నారు. మూసిలో ప్రవహించే మురుగునీరు వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా ఐదు టీఎంసీల గోదావరి నీటిని ప్రవహింపజేసి మురుగు కంపు తొలగించి, మంచినీటిని ప్రవహింప చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉందన్నారు.
మూసి సమీప నివాసులు ఎవరు ఆందోళన చెందవద్దని , ఒకవేళ ప్రభుత్వం అన్యాయంగా ముందు వెళితే ఆపటానికి కోర్టులు ఉన్నాయన్నారు. *ఒక న్యాయవాదిగా తాను ప్రజలపై పైసా ఖర్చు భారం పడకుండా కోర్టులో కేసు వేసి ప్రజల ఇళ్లను కాపాడుతానని* పేర్కొన్నారు.
మూసికి ఎఫ్టిఎల్, బఫర్ జోన్ నిర్ణయించేందుకు అధికారుల దగ్గర ఒక ప్రాతిపదికన లేదని పేర్కొన్నారు. ఏ సంవత్సరం నుంచి మూసి హద్దులు పరిగణలోకి తీసుకుంటున్నారో చెప్పటం లేదన్నారు. కొందరి అధికారుల అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారన్నారు..
నోటీసులు ఇవ్వకుండా, ప్రజల అంగీకారం లేకుండా ఏ ఇల్లు కూలదన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇళ్ళు కూల్చాలి అంటే.. యూపీఏ హాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు నాలుగింతల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.
మూసికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరికరణ కూడా చేయవచ్చు అని పేర్కొన్నారు. నదికి ఇళ్లు ఉన్న వైపు కాకుండా.. పొలాలు ఉన్న వైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి సుందరికరణ చేయవచ్చు అని సూచించారు. ఆయా విషయాలను సీఎం రేవంత్ రెడ్డి తో చర్చిస్తానని తెలిపారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు మూసి పరివాహక ప్రాంతం తో పాటు చెరువులు, కుంటలను కబ్జా చేసి అక్రమంగా సంపాదించారన్నారు. వారే ఈరోజు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని , ప్రజల వద్దకు వచ్చి నీతి మాటలు మాట్లాడుతున్నారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.
అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని, అక్రమాలకు పాల్పడ్డ అధికారులు, కబ్జా రాయుళ్లు, బిల్దర్ల పై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ , కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి , జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వజీద్ ప్రకాష్ గౌడ్ , సీనియర్ నేత ఎస్వీ కృష్ణ ప్రసాద్ , లింగాల కిషోర్ గౌడ్ , శశిధర్ రెడ్డి , రజిని రావు తదితరులు ఉన్నారు.

