స్వావలంబన కోసం సామాజిక సేవా
*స్వావలంబన కోసం సామాజిక సేవ* * *
*స్పోర్ట్స్ 'అథారిటీ ఆఫ్ తెలంగాణ'మాజీ ' ఛైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి*
మానవసేవే మాధవసేవ అనేది జీవన విధానంలో భాగంచేసుకోవాలని సేవ సామాజిక శ్రేయస్సుకు దేశ స్వావలంబనకు సాధనం కావాలని స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ తెలంగాణ 'మాజీ చైర్మన్, అల్లీపురం' వెంకటేశ్వర్ రెడ్డి' అన్నారు.
నేడు లక్ష్మి నగర్ పార్క్ అత్తాపూర్ *సమాజ సేవలో స్వచ్చంధ సంస్థల పాత్ర* అనే అంశంపై సమావేశం జరిగింది.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ 'తెలంగాణ మాజీ ఛైర్మెన్' ఆల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
మానవుల జీవితాలు ఆయురారోగ్యాలతో'అష్టైశ్వర్యాలతో' సుఖసంతోషాలతో తొణికిసలాడాలని మనతో పాటు అందరూ బాగుండాలని లోక కళ్యాణాన్ని ఆశిస్తూ గత 10. సంవత్సరాల నుండి ఉచిత యోగా శిబిరాన్ని నిర్వహిస్తు "అందరికీ ఆరోగ్యన్ని" అందిస్తున్న ఎ'బి'సి లాఫింగ్ క్లబ్' అత్తాపూర్ యోగా సెంటర్' గురువు గారు శ్రీ' బి' సుధాకర్ గౌడ్ గారిని శాలువాతో ఘనంగా సన్మానిస్తూ వారి సేవలను అభినందనీయమని
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 'మాజీ ఛైర్మెన్ ' అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ఎ'బీ'సీ లాఫింగ్ క్లబ్ 'అత్తాపూర్ యోగా సెంటర్ గౌరవఅధ్యక్షులు డాక్టర్' బి సీతారాం మాట్లాడుతూసమాజ సేవను పౌరసమాజం
సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు.
*సన్మానం పొందిన అత్తాపూర్ యోగ సెంటర్ యోగ గురువు బి 'సుధాకర్ గౌడ్* మాట్లాడుతూ సేవ కేవలం మానవుల పట్ల మాత్రమే గాకుండా ప్రకృతి వైపు ఉండాలన్నారు.
ఎ 'బీ' సీ లాఫింగ్ క్లబ్' అత్తాపూర్ యోగా సెంటర్ *కన్వీనర్ 'స్వామి సుధాకర్ గుప్త* ప్రతి వ్యక్తి నాకోసం కాదు మీకోసం అనే సమాజ సేవా దృక్పథంతో జీవించాలని సమాజ సేవలో" స్వచ్ఛంద సైనికులుగా" ఎదగాలన్నారు.
*ఏ' బి' సి' లాఫింగ్ క్లబ్' అత్తాపూర్ యోగా సెంటర్' కో కన్వీనర్ 'ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు' ఎస్ మహేందర్* మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తను "బతుకుతూ ఇతరులకు బతికునివ్వాలని "ఇతరుల జీవితాలలో ఆరోగ్య వెలుగులు ప్రసాదిస్తున్న యోగ గురువు బి 'సుధాకర్ గౌడ్ సేవలు సమాజానికి ఆదర్శంగా నిలవడం హర్శనీయమని కొనియాడారు.
సీనియర్ యోగ సభ్యులు *ఇరుమల్ల బాలకృష్ణ ' పీ గోపాలరెడ్డి ' బ్రహ్మయ్య నాయుడు* ' మాట్లాడుతూ సమాజ సేవ చేయడానికి ఆస్తులు అంతస్తులు అక్కరలేదని స్పందించే గుణముంటే చాలు సొంత లాభం కొంత మనుకొనితోటి వారికి సాయపడే దృక్పథంతో జీవించాలన్నారు.
*నారమ్ రాజేంద్రనగర్ టెక్నికల్ ఆఫీసర్ నదికుడి ప్రభాకర్ రావు* మాట్లాడుతూ "ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న "అన్న సూక్తిని అందరు స్ఫూర్తిగా తీసుకోవాలి. సహాయం కోసం డబ్బు కాదు మనసు ఉండాలి సంకల్పం భలం ఉండాలని అన్నారు.
రెజిలింగ్ కోచ్ ఎన్'ఐ'ఎస్ హై దరాబాద్ సిటీ పోలీసు క్రాఫ్ట్ రిటైర్డ్ 'ఎ 'ఆర్ ' ఎస్' ఐ' సి' హెచ్' బోజిరెడ్డి' మాట్లాడుతూ సమాజ సేవ మానవుణ్ణి ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దు తుందన్నారు.
ఈ సమావేశంలో ఎ'బి 'సి లాఫింగ్ క్లబ్' అత్తాపూర్ యోగా సెంటర్ సభ్యులు
సి 'ఎం ' శ్రీకాంత్ ' రవి రాంబాబు ' చిన్న ' బొమ్మిని శ్రీనివాస్ ' శ్రీమతి గాయత్రి సాయి సీత 'సుజాత ' సునీత సరిత' శ్యామల' విజయ ' విజయ శ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్
లక్మి నగర్ కాలనీ జిహెచ్ఎంసి పార్కులో ఏ బి సి లాఫింగ్ క్లబ్'అత్తాపూర్ యోగా సెంటర్ ఆధ్వర్యంలో సమాజ సేవలో స్వచ్చంధ సంస్థల పాత్ర అనే అంశంపై జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మాజీ చైర్మన్ అల్లి పురం వెంకటేశ్వర్ రెడ్డి ' యోగ గురువు బి సుధాకర్ గౌడ్
డాక్టర్ బి సీతారాం సి.హెచ్ బోజిరెడ్డి స్వామి సుధాకర్ గుప్త ఇరుమళ్ళ బాల కృష్ణ
తదితరులు

