ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి ముజాహిద్ హుస్సేన్

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి ముజాహిద్ హుస్సేన్

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను  పరిష్కరించండి

 మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ 

చురకలు విలేఖరి 
హుజరాబాద్, అక్టోబర్,18

గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన అనేక రకాల సమస్యలను తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారం కొరకు మా వంతు కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలుపరచాలని తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గజిటెడ్ టీచర్స్ పెన్షనర్లు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శుక్రవారం రోజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన 5 డి ఎ లో కొత్త పిఆర్సి అన్ని ప్రైవేటు హాస్పటల్లో ట్రీట్మెంట్ పొందడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు అన్ని రకాల వైద్యం పొందడానికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డును మంజూరు చేసి దాని ద్వారా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్యం పొందడానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి లకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరుతూ జిపిఎఫ్ సలండర్ లీవ్ మెడికల్ బిల్స్ పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల బిల్లులన్నిటిని వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ టీచర్స్ పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారుIMG-20241018-WA0002

Tags:

Related Posts