భద్రత ఏర్పాట్లు పూర్తి ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఎస్పీ
గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లావ్యాప్తంగా 580 మంది పోలీసు అధికారులు, సిబ్బందిచే పటిష్ట బందోబస్తు
చురకలు ప్రతినిధి, జగిత్యాల, సెప్టెంబర్ 16 : గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని, జగిత్యాల జిల్లావ్యాప్తంగా 580 మంది పోలీసు అధికారులు, సిబ్బందిచే పటిష్ట బందోబస్తు చేపడుతున్నామని
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం బిఎల్ఎన్ గార్డెన్లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణేష్ నిమజ్జనానికి సంబంధించిన భద్రతపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం ఉత్సవం సందర్భంగా ప్రజలు ఎక్కువగా రావడం జరుగుతుందని వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. నిమజ్జనోత్సవానికి భద్రతపరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 580 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందిచే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ప్రశాంత నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని కోరారు. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది బందోబస్తు కేటాయించిన ప్రాంతంపై పూర్తి అవగాహన మరియు చేయవలసినటువంటి డ్యూటీ గురించి పూర్తిగా తెలిసి ఉండాలన్నారు. డ్యూటీ ప్రదేశం నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్ళకూడదని డ్యూటీ పరంగా లేదా ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు రఘు చందర్ రవీంద్ర కుమార్ రంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, వేణుగోపాల్, రామ్ నర్సింహారెడ్డి, రవి, కృష్ణారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

