దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి ఎస్పీ అశోక్ కుమార్
దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు విలేఖరి
జగిత్యాల, అక్టోబర్,11
దసరా పండుగ ను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత పరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దసరా పండుగను, దుర్గ నిమజ్జన ను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో జమ్మి చెట్టు పూజా, నరకాసుర వధ జరేగే జంబిగద్దె ప్రాంతాన్ని పరిశిలించి భద్రత పరంగా చేయవల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకి సూచనలు చేశారు.
ఎస్పీ వెంట డీఎస్పీ రఘు చందర్, ఎస్. బీ ,ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్ రూరల్ సి.ఐ కృష్ణ రెడ్డి, ఎస్. ఐ సదాకార్ ఉన్నారు.

