పోలీస్ స్టేషన్ పరిధిలో వీపీఓ వ్యవస్థ కలిగి ఉండాలి ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ స్టేషన్ పరిధిలో వీపీఓ వ్యవస్థ కలిగి ఉండాలి ఎస్పీ అశోక్ కుమార్

*- - - పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వీపీఓ వ్యవస్థ కల్గి ఉండాలి.*

*- - - పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి.*

*- - - ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పై రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి*

*- - -   క్రైమ్ మీటింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్


జగిత్యాల, అక్టోబర్ 28

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ   మాట్లాడుతూ.... నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని ఇప్పటివరకు నమోదైన  కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై  నిఘా ఉంచాలని  వారి పై కేస్ లు  నమోదు చేయాలని అన్నారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు  జారిచేసిన  నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. వివిధ నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తెరువబడిన నేరచరితులు విధిగా పోలీస్ స్టేషన్కి  హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండోవర్ చేయాలని అన్నారు. రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సూచి బోర్డ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి  వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పిడీఎస్ రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.

*పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విపిఓ వ్యవస్థ కల్గి ఉండాలి*

ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు. విపీఓ లు  ప్రతి  గ్రామని  సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి  మార్గంలో నడిచేటట్లు  వారికి అవగాహన కల్పిచాలన్నారు.

*విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ  ప్రోత్సాహకాలు*

విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ  ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ  సమావేశంలో  అడిషనల్ ఎస్పీ భీమ్ రావు , డిఎస్పి లు రవీంద్ర కుమార్, రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు, మరియు డీ సి ఆర్ బీఐ  సి సి ఎస్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,రఫీక్ ఖాన్, మరియు సి.ఐ లు వేణుగోపాల్,రామ్ నరసింహారెడ్డి,రవి,నిరంజన్ రెడ్డి, కృష్ణ రెడ్డి,మరియు ఎస్.ఐ లు, డీ సి ఆర్ , ఐటీ కోర్ సిబ్బంది  పాల్గొన్నారు.IMG-20241028-WA0001

Tags:

Related Posts