సిఈఐఆర్ అప్లికేషను సద్వినియోగం చేసుకోవాలి ఎస్పీ అశోక్ కుమార్
సిఈఐఆర్ అప్లికేషను సద్వినియోగం చేసుకోవాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 7 : సెల్ఫోన్లు పోయినా, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని, పొగొట్టుకున్న సెల్ఫోన్లను సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెల్ఫోన్లు పొగోట్టుకున్న, చోరీకి గురైన రూ.20లక్షల విలువ చేసే 104 సెల్ఫోన్లను బాధితులకు ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్ఫోన్లు పోయిన, చోరీకి గురైన త్వరితగతిన పట్టుకోవడానికి సీఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని, సిఈఐఆర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలు నమోదు చేసుకుంటే సెల్ఫోన్లను ఈ పోర్టల్ సులభంగా స్వాధీనం చేసుకొని ఆస్కారం ఉందన్నారు. పోయిన సెల్ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో ఓ ఆర్ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా ఓబృందం ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు
జిల్లాలో 601 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని తెలిపారు. సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు అప్పగించడం పట్ల బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సిఈఐఆర్ బృందం హెడ్ కానిస్టేబుల్ మహేముద్, కానిస్టేబుల్ మల్లేశం, అబ్జర్
యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

