ఆటో యూనియాన్ అధ్యక్ష ఎన్నికల్లో శ్రీనివాస్ విజయం

ఆటో యూనియాన్ అధ్యక్ష ఎన్నికల్లో శ్రీనివాస్ విజయం

ఆటో యూనియన్ అధ్యక్ష ఎన్నికలలో శ్రీనివాస్ గౌడ్ ఘన విజయం.

చురకలు ప్రతినిధి వేములవాడ సెప్టెంబర్ 30 :వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఘన విజయం లభించింది. గౌడ్ తన సమర్థ నేతృత్వంతో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్న గౌడ్, ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడతామని తెలిపారు.  ఈ అధ్యక్ష ఎన్నికలలో ఉమర్ కు 266 ఓట్లు రాగ,బత్తుల దేవయ్య కు 220 ఓట్లు వచ్చ్చాయి. గెలిచిన అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కు 798 రాగ 538 మెజారిటీ తో శ్రీనివాస్ గౌడ్ ఘన విజయం సాధించారని ఎన్నికల నిర్వాహకులు అజ్మాత్ అలీ, దేవయ్య, యూసుఫ్ శేఖర్ తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు యూనియన్ సభ్యుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి.IMG-20240930-WA0026

Tags:

Related Posts