మానస స్కూల్ విద్యార్థికి రాష్ట్ర స్థాయి రెండవ బహుమతి
*జగిత్యాల మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థి కి ప్రజ్ఞ వికాస్ వ్యాసరచన పోటీలో రాష్ట్ర స్థాయి 2వ బహుమతి*
జగిత్యాల జిల్లా కేంద్రం లో గల మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న B. శిశిర్ చంద్ర హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజ్ఞా వికాస్ వ్యాసరచన పోటీలో రాష్ట్ర స్థాయి లో 2వ ర్యాంక్ సాధించి నగదు బహుమతిని గెలుచుకున్నందుకు గర్విస్తున్నాము. ట్రస్మా వారిచే రాష్ట స్థాయి లో నిర్వహించబడిన ఈ వ్యాస రచన పోటీలో B.శిశిర్ చంద్రకు తన అసాధారణ ప్రదర్శనకు గాను అతనిని ₹8,000 నగదు బహుమతి చే అభినందించడం జరిగింది. ఈ విజయం మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మా విద్యార్థుల అంకితభావాన్ని మరియు విద్యా నాణ్యతను ప్రదర్శిస్తుంది అని పాఠశాల ప్రిన్సిపాల్ రజిత రావు గారు అత్యద్భుతమైన విజయం సాధించినందుకు శిశిర్‌ని అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లు శ్రీధర్ రావు ,హరిచరణ్ రావు ,మౌనిక రావు లు పాల్గొన్నారు.

