ఉమ్మడి జిల్లా స్థాయి ఖో ఖో పోటీలను ప్రారంభించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి

ఉమ్మడి జిల్లా స్థాయి ఖో ఖో పోటీలను ప్రారంభించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి

చురకలు ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 20
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 18 ఖోఖో ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను అంబేడ్కర్ స్టేడియంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడా పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకొని నరేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి తోడ్పాటు నందిస్తాయని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని త్వరలో  క్రీడా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతుందని అన్నారు.క్రీడా పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.కరీంనగర్ జిల్లా ఖ్యాతిని ఖోఖో విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని కోరారు.IMG-20241020-WA0008

Tags:

Related Posts