కమీషనర్ పై చర్యలు తీసుకోండి

కమీషనర్ పై చర్యలు తీసుకోండి

 కమీషనర్ సమ్మయ్య పై చర్యలు తీసుకోవాలి - 35 వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ..

 

జగిత్యాల,IMG-20241013-WA0006

నిన్న పట్టణంలో "దసరా పండగ" సందర్భంగా స్థానిక  జంబిగద్దె వద్ద ఏర్పాటు చేసే జమ్మి వృక్షాన్ని గత కొన్ని దశాబ్దాల నుండి మున్సిపల్ వారు ట్రాక్టర్ పంపి తీసుకు వచ్చే ఆనవాయితీ ఉంది., 

కానీ కమిషనర్ మున్సిపల్ ట్రాక్టర్ పంపవద్దని కింది స్థాయి సిబ్బందికి హుకుం జారీ చేయడం వల్ల ట్రాక్టర్ ను పంపక పోవడం వల్ల వారు మోతే గ్రామ పంచాయతి వారి వద్దనుండి ట్రాక్టర్ తెప్పించుకొని ఏర్పాట్లు చేసుకోన్నామని తెలిపారు.

మున్సిపల్  కమీషనర్ పట్టణ ప్రజలు, భక్తులు, మున్సిపల్ పాలక వర్గం మనోభావాలను దెబ్బతీసినందు వల్ల ఈ అంశంపై విచారణ జరిపి కమీషనర్ మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకుపోనున్నట్లు ఆమె తెలిపారు.

Tags:

Related Posts