వినియోగదారులకు మరింత చేరువైన సాంకేతిక పరిజ్ఞానం ఎస్, ఇ, సాలియా నాయక్
వినియోగదారులకు మరింత చేరువై సాంకేతిక పరంగా మరిన్ని అంశాలు జోడించి TGNPDCL యాప్ ను రూపొందించడం జరిగిందని , వినియోగదారుల సౌకర్యార్ధం 19 ఫీచర్లతో TGNPDCL యాప్ ఉందని ఈ. సాలియా నాయక్ , సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్, జగిత్యాల అన్నారు .
ఇందులో
రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ :
ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన ఇందులో GPS లొకేషన్ ద్వారా వినియోగదారుని ఫోన్ లోని కెమెరా నుండి ఆ సంఘటనను ఫోటో తీసి పంపవచ్చు . తద్వారా రిపోర్ట్ నేరుగా సంబంధిత అధికారికి వెళ్తుంది. వెంటనే ఆ అధికారి స్పందించి ఆ సమస్యను పరిష్కారం చేస్తారనీ ఎస్ఇ పేర్కొన్నారు..
కన్స్యూమర్ గ్రీవెన్సెస్ : ,న్యూ కంప్లైంట్ : వినియోగదారునికి సంబంధించిన సమస్యలను నేరుగా ఇందులో పొందుపరచవచ్చును . వారి మీటర్ నెంబర్ , సమస్య తాలూకు వివరాలు ఇందులో నమోదు చేస్తే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందనీ ,విద్యుత్ కు సంబంధించిన ప్రతి అంశం పై ఫిర్యాదు చేసుకునే సౌకర్యం ఇందులో ఉందని వివరించారనీ ఎస్ ఇ పేర్కొన్నారు.
కంప్లైంట్ స్టేటస్ :
ఫిర్యాదు చేసిన సమస్య స్టేటస్ ను ఇందులో చూసుకునే సౌలభ్యం ఉందన్నారు .
రి ఓపెన్ కంప్లైంట్: ఫిర్యాదు చేసిన సమస్య పై సంతృప్తి చెందక పోతే మరల పునరావృతం చేసుకునే వీలుందన్నారు .
సెల్ఫ్ రీడింగ్ :
ఇందులో వినియోగదారులు సెల్ఫ్ రీడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది . ప్రతి నెల వారి విద్యుత్ బిల్లులను స్వయంగా సెల్ఫ్ మీటర్ రీడింగ్ చేసుకోవచ్చన్నారు .
పే బిల్స్ :
నెల వారి విద్యుత్ బిల్లులను వినియోగదారుల సర్వీస్ నెంబర్ నమోదు చేసుకొని చెల్లించవచ్చు . ఇది చాల సులభం , సౌకర్యవంతం , వేగవంతం , సురక్షితం . సమయం ఆదా చేసుకోవచ్చు . కేవలం రెండు నిమిషాల్లో చెల్లించవచ్చు . మారుతున్నా కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి డిజిటలైజేషన్ గ మారుతుంది కనుక ఇలా చెల్లింపుచేయడం శ్రేయస్కరం .
బిల్ హిస్టరీ :
వినియోగదారులు చెల్లించిన విద్యుత్ బిల్లుల చెల్లింపు గత చరిత్ర ఇందులో చూసుకోవచ్చని తద్వారా ప్రతి నెల బిల్లు ఎంత వస్తుంది పోల్చుకోవచ్చని అన్నారు . అలాగే విద్యుత్ వినియోగం ఏ నెల ఎంత పెరిగిందని చూసుకోవచ్చని తద్వారా పొదుపు చేసుకొని బిల్లు తగ్గించుకోవచ్చన్నారు .
ఆన్ లైన్ పేమెంట్ హిస్టరీ :
ఆన్ లైన్ ద్వారా చెల్లించిన తాలూకు సమాచారం ఇందులో ఉంటుందని వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా చెల్లించిన సమాచారం ఇందులో వినియోగదారులు తెలుసుకోవచ్చని తెలిపారు .
లింక్ ఆధార్ & మొబైల్ :
వినియోగదారుల ఆధార్, మొబైల్ నంబర్లు లింక్ చేసుకోవడం వలన విద్యుత్ బిల్లుల ప్రతి సమాచారం ప్రతి నెల ఫోన్ లకు సమాచారం అందుతుందని ,అలా సమాచారం రావడం వలన వెంటనే యాప్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చని అన్నారు .
డొమెస్టిక్ బిల్ క్యాలిక్కులెటర్ :
వినియోగదారుల నెల వారి విద్యుత్ వినియోగం తాలూకు మీటర్ రీడింగ్ వివరాలు ఇందులో పొందుపరుస్తే బిల్లు తాలూకు పూర్తి సమాచారం వివరాలు చూపడం జరుగుతుందని చెప్పారు .
కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి :
కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవడానికి సంబంధించిన పూర్తి ఇందులో పొందు పరచడం జరిగిందని, ఆ వివరాల అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు .
పేరు , లోడ్ మార్పు గురించి :
విద్యుత్ మీటర్ పేరు మార్పు గురించి సవివరాలు , లోడ్ గురించి వివరాలను ఇందులో ఉన్నాయని , ఇందులోని వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు .
పవర్ కంజంప్షన్ గైడ్ లైన్స్ :
విద్యుత్ ఉపకరణాలు ఎంత వాడితే ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో ఇందులో వివరించారు.
టారిఫ్ డీటెయిల్స్ :
విద్యుత్ వినియోగం చార్జీల వివరాలు క్యాటగిరీల వారీగా ఇందులో సవివరంగా ఉంటాయని , గృహ వినియోగదారులు , గృహేతర వినియోగదారులు , పరిశ్రమలు తదితర వివరాలు క్యాటగిరీల వారీగా చార్జీల వివరాలు పొందుపరచడం జరిగిందని తెలిపారు .
ఎనర్జీ సేవింగ్ టిప్స్ :
ఇందులో విద్యుత్ ఉపకరణాలు వాడుతున్నపుడు ఆచరించవలసిన పొదుపు సూచనలు విపులంగా పేర్కొన్నబడ్డాయని , విద్యుత్ పొదుపు చేయడానికి సూచనలను అనుసరించి విద్యుత్ ను పొదుపు గా వాడుకోవాలని కోరుతున్నారు .
సేఫ్టీ టిప్స్ :
విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలను వివరించడం జరిగిందని , ఎప్పటికప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నామని విద్యుత్ అనేది ప్రమాదకరం అని ప్రతి ఒక్కరు గుర్తించాలని, స్వీయ నియంత్రణ ముఖ్యమని , ఎట్టి పరిస్థితిల్లో స్వంతంగా రిపేర్లు చేయకూడదని ఈ సందర్బంగా కోరారు .
ఫీడ్ బ్యాక్ :
వినియోగదారులకు అందిస్తున్న సేవల పట్ల ఇక్కడ వారి అభిప్రాయాన్ని పంచుకోవచ్చని , ఇది చాల ముఖ్యం అని అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొని మరింత మెరుగైనసేవలు అందించేందుకు దోహదపడుతుందని చెప్పారు .
మై అకౌంట్ :
మై అకౌంట్ లో వినియోగదారుల పూర్తి వివరాలు ఉంటాయని వారి మీటర్ తాలూకు వివరాలు, తదితర సమాచారం ఉంటుందని అన్నారు .
వినియోగదారుల బిల్లు సమాచారం :
వినియోగదారుల బిల్లు తాలుకు సమాచారం ఉంటుందని , ఇందులో వినియోగదారుల సర్వీస్ నంబర్ ను నమోదుచేసి బిల్లు వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు .
వినియోగదారుల పరిధిలోని అధికారి వివరాలు :
వినియోగదారుల పరిధిలోని అధికారి ని సంప్రదించాలంటే ఇందులో నుండి తెలుసుకోవచ్చని అన్నారు . వినియోగదారులకు ఎటువంటి సందేహాలు ఉన్న మీ పరిధిలోని అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని అన్నారు . ఇలా అధికారిని సంప్రదించే అవకాశం చేర్చడం జరిగిందని వివరించారు .
కాంటాక్ట్ ఆజ్ :
ఇందులో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఉంటాయని , సమస్యల పరిష్కారం కొరకు సంప్రదించి , సమస్యలను పరిష్కరించే వెసులుబాటు ఉందని అన్నారు . ఆ టోల్ ఫ్రీ నంబర్లు 18004250028, 1912 .
వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ లో tgnpdcl యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని పై సేవలు పొంది మరింత నాణ్యమైన, మెరుగైన సేవలు పొంది సంస్థ కు సహకరించి , సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని
ఈ. సాలియా నాయక్,
ఎస్ ఈ, జగిత్యాల కొరారు.

