తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ జెండా ఆవిష్కరణ
చురకలు ప్రతినిధి
ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 17 ;
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య అన్నారు,
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ జెండా ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు ,
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీల ఆఫీసుల వద్ద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ’జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలకించారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు మాట్లాడుతూ ఎందరో త్యాగాల పలితమే స్వరాష్ట్రం పోరాటాలు సంఘర్షణలతో సాధించుకున్న తెలంగాణ ప్రపంచ దేశాలకు ఆదర్శమని వారు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి నిర్మా ణాత్మక ప్రణాళికలతో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అర్హత గల ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందించేందుకు అధికార యంత్రాంగం పారదర్శకంగా పని చేయాలన్నారు . అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో
అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తున్నా మని తెలిపారు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాలను మండలంలో పలు చోట్ల ఎగుర వేశారు,
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి , కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, సూడిది రాజేందర్ గుండాడి రామిరెడ్డి , రఫీక్ , పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు , బండారి బాల్ రెడ్డి, నంది కిషన్ , మెండే శ్రీనివాస్ యాదవ్. గంట కార్తీక్ గౌడ్ మాజీ సర్పంచ్ రవీందర్ గుప్తా , అంతేర్పుల గోపాల్ వడ్నాల ఆంజనేయులు, మద్దుల శ్రీపాల్ రెడ్డి సద్ది పద్మా రెడ్డి గంట ఆంజనేయులు గౌడ్ గంట వెంకటేష్ గౌడ్ మిర్యాల్ కర్ చందు , పట్టణ యూత్ అద్యక్షులు నవాబ్ , తిమ్మాపూర్ సత్యనారాయణ సోషల్ మీడియా ప్రతినిధి బీపేట రాజ్ కుమార్, పాల్గొన్నారు.

