అంజన్నను దర్శించుకున్న రాష్ట్ర డిజిపి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిజిపి డా. జితేందర్ రెడ్డి.
అంజన్నను దర్శించుకున్న రాష్ట్ర డిజిపి
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిజిపి డా. జితేందర్ రెడ్డి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 1: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని శనివారం తెలంగాణ రాష్ట్ర డిజిపి డా. జితేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాష్ట్ర డిజిపి డా.జితేందర్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకు ముందుకు రాష్ట్ర డిజిపి డా.జితేందర్ రెడ్డి
పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అధికారులు రాష్ట్ర డిజిపి డా.జితేందర్ రెడ్డిని స్వామివారి శేషవస్త్రంతో సన్మానించగా, ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ నీలం రవి, ఎస్ఐ చిర్ర సతీష్, పోలీసులు అధికారులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

