ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
సీఎం సహాయనిధితో ప్రజలకు ఆర్థికంగా భరోసా
పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి
చురకలు ప్రతినిధి, జగిత్యాల, నవంబర్ 12 : ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సీఎం సహాయనిధితో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థికంగా భరోసాగా
కల్పిస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఇందిరాభవన్లో జగిత్యాల పట్టణం, జగిత్యాల అర్బన్ మండలాలకు చెందిన 200 మంది లబ్దిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 1కోటి 23లక్షల 59వేల విలువ గల చెక్కులను ఎమ్మెల్సీ జీవన్
రెడ్డి లబ్దిదారులకు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యసేవలు పొందాలని సూచించారు. సీఎం సహాయనిధి కార్పోరేట్ ఆస్పతుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశం ఉంటే ఉచిత వైద్యసేవలు పొందడం హక్కు అని అన్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తన హాయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారని, గత దశాబ్దాల కాలంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, ప్రజలకు ఎలాంటి సహాయమైన చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటవన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ముకస్పర్ అలీ నేహల్, కౌన్సిలర్ కమల్, మాజీ కౌన్సిలర్ మునీరోద్దీన్ మున్నా, నాయకులు కొత్త మోహన్, గుండా మధు, భీరం
రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

