హామీల అమలు కోసం సంజయ్ పాదయాత్ర
హామీల అమలు కోసం డాక్టర్ సంజయ్ పాదయాత్ర
తల్లిదండ్రుల ఆశీర్వాదం అనంతరం ప్రారంభమైన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాదయాత్ర
నియోజకవర్గం నుండి తరలిన రైతులు పార్టీ శ్రేణులు
అడుగడుగునా జననిరాజనం మధ్య కొనసాగుతున్న పాదయాత్ర
ఇబ్రహింపట్నం , నవంబర్,12
హామీలు అమలు చేయకపోవడం, విద్యుత్ కోతలు, ఎరువుల ధరల పెంపు, విత్తనాల కొరత,పుర్తిస్థాయిలో కాని రైతు రుణమాఫీ, రైతులకు ఇప్పటికీ అందని పెట్టుబడి సాయం, రాష్ట్రంలో ఏర్పడ్డ తదితర సమస్యలతో జగిత్యాల జిల్లా రైతులు సతమతమవుతున్నారని. ఈ నేపథ్యంలోనే పోరుబాటకు సమాయత్తమయ్యారు . డాక్టర్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్ పల్లి , కోరుట్ల,మెట్ పల్లి పటణం, కోరుట్ల పటణం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకువచ్చేందుకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సిద్ధమైయి మంగళవారం మెట్ పల్లి పట్టణంలో జగిత్యాల జిల్లా భిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే సంజయ్ తల్లి తండ్రులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు- సరోజమ్మ ల ఆశీస్సులు తీసుకొని రైతులతో కలిసి కోరుట్ల నుంచి ‘రైతు పోరాట పాదయాత్ర’ చేప్పట్టారు. ఉదయం 8 గంటలకు కోరుట్ల పటణం శివారులో పాదయాత్ర పారంభం కాగ వెంకటాపూర్, మేడిపల్లి, తాటిపెల్లి, చల్‌గల్ మీదుగా జగిత్యాలకు చేరుకోనున్నది. చల్‌గల్ సమీపంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశీరావు పాదయాత్రకు సంఘీభావం తెలియజేసి, అక్కడి నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నారు. పాదయాత్రలో రైతులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

