జనసంద్రోహంగా సంజయ్ మహా పాదయాత్ర

జనసంద్రోహంగా సంజయ్ మహా పాదయాత్ర

జనసంద్రోహంగా సంజయ్ మహా పాదయాత్ర

- రైతన్న సమస్యల కోసం పాదయాత్ర

- సంజయ్ కు అడుగడుగునా మంగళ హారతులతో మహిళల స్వాగతం
- పాదయాత్ర లో పాల్గొన్న బాల్కొండ ఎమ్మేల్యే వేముల ప్రశాంత్,చల్ గల్ లో హరీష్ రావు ఎంట్రీ
- బిఆర్ఎస్ నాయకుల్లో ఫుల్ జోష్

మెట్ పల్లీIMG-20241112-WA0004


రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డా' కల్వకుంట్ల సంజయ్ మహా పాదయాత్ర చేపట్టారు.మంగళవారం మెట్ పల్లీ పట్టణంలోని ఎమ్మేల్యే కార్యాలయం నుంచి పెద్దఎత్తున రైతులతో కలిసి మహా పాదయాత్రను ప్రారంభించగా తండ్రి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తల్లి సరోజనమ్మ  ఆశీర్వాదం తీస్కొని రైతు పాదయాత్రకు తన నివాసం నుండి బయల్దేరారు. ఈ పాదయాత్రలో బాల్కొండ ఎమ్మేల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొనగా రైతు సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్న సంజయ్ కు పూలమొక్కతో స్వాగతం పలికారు.పదివేల మంది రైతులతో 25కిలోమీటర్ల పొడవున ఈ పాదయాత్ర చేపడ్తుండగా జగిత్యాల కలెక్టరేట్ వరకు సాగనున్న ఈ పాదయాత్రలో మాజీ మంత్రి ఎమ్మేల్యే హరీష్ రావు పాల్గొననుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో చల్ గల్ లో పాదయాత్రలో పాల్గొంటారు.అనంతరం జగిత్యాల కొత్త బస్ స్టాండ్ సమీపంలో రైతు సమస్యలను ఉద్దేశించి ప్రసంగించి కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తారు.

Tags:

Related Posts