కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ఎవరి సంపాదనలో వారు పడ్డారు విద్యాసాగర్ రావు
రాక రాక కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తె ఎవరి సంపాదనలో వాళ్లే పడ్డారు..
ప్రజల బాగోగులు చూడంటం లో విఫలమైయ్యారు
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
రాక రాక కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తె ఎవరి సంపాదనలో వాళ్లే పడ్డారని, ప్రజల బాగోగులు చూడంటం లో విఫలమైయ్యారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఈసందర్భంగా మంగళవారం కోరుట్ల నియెజికవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన చావుకి కూడా భయపడకుండా 14 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాడి తెచ్చిన తెలంగాణ దుర్మార్గుల చేతిలోకి పోయింది. కాబట్టి తెలంగాణను కాపాడుకోడానికే ఈ పాదయాత్ర చేస్తున్నామని,కేసీఆర్ ప్రజల హృదయాల్లో ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ కి దొంగ మాటలు నమ్మి అమాయకపు ప్రజలు ఓటు వేశారే తప్ప పార్టీ పైన కాని ,ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మీద ప్రేమతో కాదన్నారు.

