దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్
By: Mohammad Imran
On
ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్టు
చురకలు విలేకరి, జగిత్యాల, అక్టోబర్ 21 : జగిత్యాల పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు వడ్లూరి నాగరాజును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ నిందితుడైన నాగరాజు జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపల్లి గ్రామానికి చెందిన వాడు కాగా, జగిత్యాల పట్టణ పరిధిలో ఓ ఆలయంలో, రూరల్ మండల పరిధిలోని రెండు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో
వెల్లడించినట్లు సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుండి అపహరించిన ఆలయాలకు చెందిన సామాగ్రిని స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
Tags:

