ఊరిక్కొక్క ఉద్యోగి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పక్కాగా అమలుపై ప్రభుత్వం కసరత్తు
ఊరికొక్క ఉద్యోగి! *గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పక్కాగా! *అమలుపై ప్రభుత్వం కసరత్తు. *ప్రతిపాదనలు సమర్పించిన భూపరిపాలన శాఖ. *11 వేల మంది ఉద్యోగులు అవసరమని ఆంచనా. *కేబినెట్ లో చర్చ తర్వాతే నిర్ణయం. జగిత్యాల :కొందరు వీ.ఆర్.ఓ.లు అవినీతికి పాల్పడుతున్నారని ఎలాంటి ప్రత్యమ్నాయం చూపించకుండానే మొత్తం వీ ఆర్ ఓ.వ్యవస్థనే గత బి.ఆర్.ఎస్.ప్రభుత్వం రద్దు చేసింది.ఈ అనాలోచిత రద్దుతో భూ పరిపాలన వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది.దీనితో పాటు గ్రామాల్లో ప్రతి ప్రభుత్వ శాఖ కు తగు సమాచారం ఇస్తూ 24 గంటలు రెవెన్యూశాఖకే సేవలందించిన వీ.ఆర్.ఏ.వ్యవస్థను సైతం రద్దు చేయడం తో అటు ప్రజలకు,ఇటు ప్రభుత్వ శాఖలకు సమస్యల పరిష్కారం జటిలంగా మారింది. రెవెన్యూ శాఖకు మూల స్తంభాలుగా ఉన్న వీ.ఆర్.ఓ.,వీ.ఆర్.ఏ.వ్యవస్థలను పునరుద్ధరించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో కసరత్తు ముమ్మరం చేస్తోంది.గ్రామానికో ఉద్యోగి ఉండేలా ఏర్పాటు చేస్తే భూ పరిపాలన సజావుగా సాగుతుందనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పలు అంశాలు జోడిస్తూ అందుకు తగిన ప్రతిపాదనలు భూ పరిపాలన శాఖ(సి.సి.ఎల్.ఏ) ప్రభుత్వంకు సమర్పించింది.ఈ విషయం లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.ఇదే క్రమంలో ధరణి ఫోర్టల్ లో నిర్వహణ పరమైన లోపాల తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ని సరిదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత ను ప్రవేశపెట్టడానికి కొత్త గా ఆర్.ఓ.ఆర్.చట్టం 2024 చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం ఆ చట్టం డ్రాఫ్ట్ బిల్లులో సాదా బైనామాల అమలు తో పాటు 10 రకాల భూములను మ్యుటేషన్ చేసే అధికారం తహశీల్దార్లకు కట్టబెడుతూ ప్రతిపాదించింది. అయితే అప్పీళ్లను విచారించే అధికారం ఆర్డీవో పై స్థాయిలో కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)కు కట్టబెట్టాలని ముసాయిదా లో ప్రతిపాదించారు.ఈ చట్టం పై 33 జిల్లాల్లో అన్నివర్గాల తో పాటు ప్రస్తుత రెవెన్యూ అధికారులు,మాజీ రెవెన్యూ అధికారులు,తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల అసోసియేషన్ నాయకులతో చర్చా వేదికలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. కాగా అప్పీళ్లపై నిర్ణయం తీసుకునే అధికారం ఆర్డీవోలకే ఇవ్వాలని .. తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టములో అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.భూములకు సర్వే తప్పనిసరిగా చేయాలన్న నిబంధన కొత్త ఆర్.ఓ.ఆర్.లో ప్రతిపాదించల ని ప్రజలు కోరుతున్నారు.అయితే శాశ్వత భూదార్ కోసం రీ సర్వే అనివార్యమవుతుందని తెలుస్తోంది.ఊరి కొక్క ఉద్యోగి విషయంలో సి.సి.ఎల్.ఏ.ప్రభుత్వంకు సమర్పించిన నివేదికలో దాదాపు 11 వేల ఉద్యోగులు అవసరం అవుతారని పేర్కొన్నట్లు సమాచారం.అయితే వీ.ఆర్.ఓ.ల రీతిలోనే పని చేయడానికి జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్,లేదా మరో రెవెన్యూ పరిశీలకుడు లాగా ఊరికొక్క ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నట్లు అట్టి వ్యవస్థ అమలుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.ఉద్యోగులుగా వీ ఆర్ ఓ వ్యవస్థలో ఇతర శాఖలకు కేటాయించిన వారినే తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగ సంఘం,వీ.ఆర్.ఓ.ల సంఘాలు ప్రభుత్వంను కోరుతున్నాయి.అయితే ఈ విషయం లో ఊరికొక్క ఉద్యోగిని ఎవరిని తీసుకుంటారనే దానిపై కేబినెట్ లో చర్చించిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశముంది. * ఊరికొక్క ఉద్యోగి తో ప్రజల సమస్యలు పరిష్కారం. - హరి ఆశోక్ కుమార్ మాజీ అధ్యక్షుడు,తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్,జగిత్యాల జిల్లా. గత ప్రభుత్వం ప్రత్యమ్నాయం చూపించకుండా వీ.ఆర్.ఓ,వీ ఆర్ ఏ.ల వ్యవస్థను రద్దు చేసింది.గ్రామానికో ఉద్యోగిని నియమించాలన్న విషయాన్ని ఇటీవల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడము హర్షణీయం. అయితే గ్రామ రెవెన్యూ అధికారులు గా పనిచేసిన వారినే తిరిగి మాతృ శేఖలోకి తీసుకోవాలి.వీ ఆర్.ఓ.లను ఊరికొక్కరు ఉద్యోగులు గా తీసుకుంటేనే ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయి.అర్హత కలిగిన వీ.ఆర్.ఏ.లకు సైతం ఊరికొక్క ఉద్యోగుల నియామకం లో ప్రాధాన్యతనివ్వాలి.కొత్త రెవెన్యూ చట్టంలో అనేక రకాలైన సమస్యలు చేసేందుకు రెవెన్యూ అధికారులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుండడంతో ప్రజలకు మేలైన రెవెన్యూ సర్వీసులు అందుతాయి.

