వెళ్దండ పి. ఎస్. ను తనిఖీ చేసిన ఐ. జి
వెళ్దండ పి,ఎస్ ను తనిఖీ చేసిన ఐ,జి
చురకలు విలేఖరి
నాగర్ కర్నూల్ , అక్టోబర్,10
మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ వెల్దండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది, తనిఖీలొ భాగంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులన్నీ పరిశీలించనైనది. మరియు నేరాల గురించి, రోడ్ యాక్సిడెంట్లు గురించి మరియు దొంగతనాల గురించి తెలుసుకోనైనది. అనంతరం ఐ . జి మాట్లాడుతూ నాగర్ కూర్నూల్ ఎస్పి ఆధ్వర్యంలో గంజాయి, పిడిఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణ, పేకాట, జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపాలని, ప్రజలకు 24 గం లు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచనలు అందించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ మరియు పని తీరును ప్రశంసించారు,కార్యక్రమంలో కల్వకుర్తి డి.ఎస్.పి వెంకటేశ్వర్లు , వెల్దండ సర్కిల్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ,మరియు వెల్దండ ఎస్సై కురుమూర్తి మరియు వారి సిబ్బంది ఉన్నారు.

