ఆస్తి గొడవతో తమకు ఎలాంటి సంబంధం లేదు

ఆస్తి గొడవతో తమకు ఎలాంటి సంబంధం లేదు

ఆస్తి గొడవతో తమకు ఎలాంటి సంబంధం లేదు.. కేవలం లీజు అగ్రిమెంట్ దారులమే మేము..!

లతిఫీ ఖాన్ దాన్ గురించి యావత్తు కరీంనగర్ వాసులకు తెలుసు

హుదా స్కూల్ ను నిర్వీర్యం చేసే కుట్ర..మాకుటుంబం పై బురదజల్లే యత్నం

గత 22సంవత్సరాలుగా వేలాదిమంది  పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నాం

ఇర్ఫానుల్లా ఖురేషి కుటుంబ సభ్యులను పావుగా వాడుకొని తమపై తప్పుడు ఆరోపణలు 

హుదా స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ రబ్ ముజాహిద్ లతిఫీ ఖండన

మెల్ రోజ్ స్కూల్ యజమాని ఇఫ్ఫత్ యాస్మిన్ ఆస్తి పాస్తులతో.. తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము కేవలం స్కూల్ బిల్డింగ్ లీజు అగ్రిమెంట్ దారులమేనని హుదా స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ రబ్ ముజాహిద్ లతిఫీ స్పష్టంచేశారు. ఆదివారం హుదా స్కూల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లతిఫీ కుటుంబ నేపథ్యం ఎలాంటిదో కరీంనగర్ వాసులందరికి తెలుసని, దివంగత ఇర్ఫానుల్లా ఖురేషి కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని, పావుగా వాడుకుంటూ ఒక ప్రయివేటు స్కూల్ యజమాని, అతడి తమ్ముడు కలిసి తమపై చేయించిన ఆరోపణలను ఖండించారు. తమను హుదా మాఫియా అని, కబ్జాదారులమని సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేయిస్తున్నారని, ఎవరు మాఫియా నో, ఎవరు కబ్జాదారులో, గుండాలు ఎవరో, ధర్మం పక్షాన నిలబడి నీతివంతంగా జీవించేది ఎవరో కరీంనగర్ సమాజానికి అందరి చరిత్ర తెలుసన్నారు. ఇఫ్ఫత్ యాస్మిన్ జీవించి ఉన్నప్పుడు, ఆమె ఇంటి దరిదాపుల్లో ఏరోజు కనిపించినటువంటి వారు, అస్తిపై కన్నేసి మేము వారసులమని వస్తున్నారని, వారసులు ఎవరైనా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆస్తిపాస్తులు ఎవరూ తీసుకున్న తమకు అసలే సంబంధం లేదని కేవలం స్కూలు బిల్డింగ్ అగ్రిమెంట్ దారులమే తామని, తమకు ఎవరి ఆస్తి, అంతస్తులు, హోదాలు, అక్కరకు లేదని, మేము ఎవరి సొమ్ము అన్యాయంగా లాక్కోలేదని, సమాజాన్ని మోసం చేసి సంపాదించి, ఎలాంటి ఆస్తులు కూడబెట్టలేదని స్పష్టం చేశారు. 
తమ స్కూలును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని 800 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే బాధతోనే తాము ఆందోళన చెందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గడచిన 22 సంవత్సరాలుగా హుదా స్కూలును  నడుపుతూ వేలాదిమంది పేద విద్యార్థులకు బాసటగా నిలిచి ఉచితంగా విద్యను అందించామని ఇంకా ఎందరికో 50% ఫీజు రాయితీ కల్పించామని తమ స్కూల్ రికార్డులను చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తాము అస్తిపై కన్నెస్తే లీజు అగ్రిమెంట్ ను ఎందుకు చేయిస్తమని, తప్పుదోవ పట్టించి కొనుగోలు డాక్యుమెంట్లను ఎందుకు చేయించుకున్నామని ప్రశ్నించారు.  గత ఐదు నెలల నుంచి మీరు విరామంగా ఆ స్కూల్ బిల్డింగ్ లో ఆధునీకరణ పనులు జరుగుతుంటే వారసులుగా చలామణి అయి వస్తున్న వీళ్లు ఎందుకు పనులను ఆపలేదని లీజు అగ్రిమెంట్ ఎందుకు చేశారని మా బిల్డింగ్ ఓనర్ ఇఫ్ఫత్ యాస్ నిన్ను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. దసరా సెలవుల తర్వాత తాము ఈ స్కూలు బిల్డింగ్ లోకి మారేది ఉండగా, ఇంతలోనే బిల్డింగ్ ఓనర్ ఇఫర్ యాస్మిన్ అకాల మరణం చందనంతో వీళ్లంతా తెరమీదకి వచ్చి కపట నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. తమ లీజ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక తాము ఈ బిల్డింగ్ లోకి వెళ్లి మారి తమ దారి తాము చూసుకుంటామని చెప్పారు. తాము చేసుకున్నది తప్పుడు అగ్రిమెంట్ అని ప్రచారం చేస్తున్నారని ఇందులో సాక్షులు సైతం ఇఫత్ యాస్మిన్ కు సంబంధించిన వాళ్లే ఉన్నారని వారిని సైతం అడగొచ్చు అన్నారు. తమపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో న్యాయపరంగా నోటీసులు పంపించి పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుదా స్కూల్ చైర్మన్ అహ్మద్ అబ్దుల్ అజీమ్, వైస్ చైర్మన్ అబ్దుల్ రౌఫ్ ఖలీద్ లతీఫీ పాల్గొన్నారు.IMG-20241006-WA0002

Tags:

Related Posts